29, డిసెంబర్ 2010, బుధవారం

సరదా తెలుగు క్విజ్ -1

తెలుగు బ్లాగరులకు సరదాగా ఒక క్విజ్. ఇది చాల సులభమైనది అనుకోండి. నిత్యం తెలుగు వాడుక భాషగా మాట్లాడే వారికి అంత కష్టం కాదు. అయితే ప్రవాసం లో ఉన్న మన తెలుగు వారు మరచి పోతున్న తెలుగును కొంచెం గుర్తు చేయాలని ఓ చిన్న ప్రయత్నం. దిగువన ఇచ్చిన సూచనల ఆధారంగా నాల్గక్షరాల పదాలు కనుక్కోండి. అన్ని పదాలకు మొదటి, ఆఖరి అక్షరాలు ఒక్కటే. 
అవి:   వి (1) _ (2) _ (3) ము (4).అంటే ప్రతి సమాధానానికి మీరు కనుక్కోవలసినది రెండక్షరాలు మాత్రమే. 

సరదా తెలుగు క్విజ్ -1

ఆధారాలు: 

1. బౌద్ధుల ఆరామము/తిరుగుట; 2. ఉనికిని తెలిపేది; 3. ఎగిరే యంత్ర సాధనం; 4. జ్ఞానాన్ని పెంపొందించేది; 5. ఖగము; 6. వేడుక / సరదా; 7. మేధస్సు ;  8. రోగము; 9. దైన్యము;  10. ఏడుపు; 11. గొప్ప బాధ; 12. తలకిందులుగా; 13. కళాకారునికి ఉండవలసినది;  14. హాస్యము /మిక్కిలి వంకర గల; 15. పెద్ద దెబ్బ/అడ్డు; 16. అతిగా ప్రేమించు; 17. అయిష్టము;  18.అడవి; 19. సంపద/గొప్పదనము;  20. కలయిక; 21. నల్లని రంగు; 22. పధ్ధతి; 23. మనవి; 24.నిర్దేశించబడినది; 25. గెలుపు; 26. రకరకాలైనది;  27. తగువు; 28. శత్రుత్వం; 29. అమరిక; 30. తెలివి; 31. తొడుగు; 32. రోత పుట్టించు ఆకారం; 33. నమ్మకము;  34. చెప్పినట్లు విను; 35. పరిశుద్ధ మైనది.

6 కామెంట్‌లు:

  1. 2. విలాసము 3.విమానము 4.విజ్ఞానము 6.విలాసము 10.విలాపము
    23.విన్నపము 25. విజయము 26.వివిధము 28.విరోధము32. వికారము 35.విమలము 33. విశ్వాసము 34.వినీతము
    నాకివి మాత్రమే తెలిశాయి.
    కానీ ఇంకా చాలా ఉన్నాయి అనుకుంటాను. విస్మయము, విహారము, వినాశము, వికాసము, విక్రమము లాంటివి.
    కానీ ఇలాంటి మెదడుకు మేత లాంటి కార్యక్రమాలు బాగుంటాయి.

    రిప్లయితొలగించండి
  2. మంచి ప్రయత్నం మందాకిని గారు. ఇంకొన్ని ప్రయత్నించండి.

    రిప్లయితొలగించండి
  3. 1) విహారము, 2) విలక్షణము, 3) విమానము, 4) విజ్ఞానము, 5) విహాంగము, 6) వినోదము, 7) వివేకము, 8) వికరము, 9)వియమము,10) విలాపము, 11) విహ్హలము, 12) విపర్యము, 13) వినయము, 14) వికటము, 15) విఘాతము, 16) విమోహము, 17).... 18) విపినము, 19) విభవము, 20) విలీనము, 21).... 22) విధానము, 23) విన్నపము, 24) విషయము, 25) విజయము, 26) వివిధము, 27) విరోధము, 28)వైషమ్యము, 29) విలాసము, 30) వికాసము, 31) విశిఖము, 32) వికారము, 33) విస్రంభము, 34) వినడము, 35) విమలము.

    రిప్లయితొలగించండి
  4. అద్భుతం సూర్యలక్ష్మి గారు. మీరు పట్టుదలగా చాల వరకు సరిగ్గా వ్రాసారు. ధన్యవాదాలు. త్వరలో సమాధానాలు ప్రకటిస్తాను.

    రిప్లయితొలగించండి
  5. ee quiz roopa kalpana baagundi...kotha alochanaku kotha samvatsaram lo naaru posindi........

    రిప్లయితొలగించండి
  6. విజయభాస్కర్ గారికి, ధన్యవాదాలు. మీకు ఈ క్విజ్ నచ్చినందుకు సంతోషం. నూతనసంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి

Blog Junctions