8, నవంబర్ 2010, సోమవారం

మంగళ హారతి పాట -శ్రీ లలితా శివజ్యోతి సర్వ కామదా!

అమ్మవారి హారతి పాటల కోసం సరియైన పాట కోసం చాల మంది వెతుకుతుంటారు. అందరికీ ఎక్కువగా రహస్యం చిత్రం లోని పాట గుర్తుకు వస్తుంది. కాని లిరిక్స్ తెలియవే అని చాల మంది తడబడుతుంటారు. అలాంటి వాళ్లకి ఉపయోగ పడటానికి ఇవిగో ఆ పాట "లిరిక్స్". ఈ చిత్రం "రహస్యం" నిర్మించిన సంస్థ "లలితా శివజ్యోతి". వారి ముందు చిత్రం "లవకుశ" ఘన విజయం సాధించిది. కాని తరువాతి చిత్రం "రహస్యం' అట్టర్  ఫ్లాప్ అయింది. కాని ఆ సినిమా లో ని ఈ హారతి పాట చాల మందికి ఇప్పటికీ గుర్తుంది. అదే ఈ పాట. 
పల్లవి:
శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా
శ్రీగిరినిలయా గిరామయా సర్వమంగళా
శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా
శ్రీగిరినిలయా గిరామయా సర్వమంగళా
శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా

చరణం:
జగముల చిరునగవుల పరిపాలించే జననీ
అనయము మము కనికరమున కాపాడే జననీ |జగముల|
మనసే నీవశమై స్మరణే జీవనమై |మనసే|
మాయని వరమీయవె పరమేశ్వరి మంగళనాయకి
శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా
శ్రీగిరినిలయా గిరామయా సర్వమంగళా
శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా

చరణం:
అందరికన్న చక్కని తల్లికి సూర్యహారతి
అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి
రవ్వల తళుకుల కళగా జ్యోతుల కప్పురహారతి
సకలనిగమ వినుతచరణ శాశ్వత మంగళహారతి
శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా
శ్రీగిరినిలయా గిరామయా సర్వమంగళా
శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా

4 కామెంట్‌లు:

  1. చక్కని పాట అందించారు,Download చెసుకునేట్టు MP3 ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది

    రిప్లయితొలగించండి
  2. శ్రీ రావుగారు,ఈ పాట హారతి పాటలో చాలా ప్రసిద్ధి చెందిన పాట.చరణంమొదటి పాదంలో జగముల చిరునగవుల అని ఉండాలేమో?అలాగే ఆఖరి చరణంలో రవ్వల తళుకుల కళా జ్యోతికి అని ఉండాలేమో.ఇదిఎందుకు గుర్తువచ్చిందంచటే
    ఇదే వరసలో నేను 'ఉమకు హారతి' అనే పాట రాసేను.అది నా భార్య సంకలనంచేసిన "భక్తిగాన లహరి" అనే పుస్తకం కోసం వ్రాసేను.నేను ఏదో వెతుకుతుంటే ఇది కనబడింది.బోరు కొట్టిస్తే క్షమించండి.
    -గంటి లక్ష్మీనరసింహమూర్తి,బెంగుళూరు.

    రిప్లయితొలగించండి
  3. మూర్తి గారికి, ఈ పాటలో సవరణలు నా దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు. నేను ఈ పాట మళ్ళీ జాగ్రత్తగా విన్నాను. మీరు చెప్పినట్లు "'సిరు నగవుల" బదులు "చిరు నగవుల" గా సరి చేసాను. అయితే "కలగా జ్యోతుల" కు బదులు 'కళగా జ్యోతుల" అని వుండాలి, "కళా జ్యోతికి" కాదు. ఇంకొక సవరణ ఎవరూ గమనించనిది, "మంగళదాయకి"' బదులు "మంగళనాయకి" అని ఉండాలి. ఈ మార్పుల్ని చేసాను. ఇప్పుడు సరిగ్గా ఉంది.

    రిప్లయితొలగించండి
  4. అద్భుతమైన హారతి పాట మీరు మళ్ళీ ఇచ్చారు....ప్రతీ తెలుగు మహిళా తప్పక పాదుకుంటుంది....వివాహ, వ్రాత, పండుగ సమయాల్లో మరీనూ ...చాలా ధన్యవాదాలు ...దయచేసి ఓం హరా శంకరా వందనం దిగంబర అన్న పాట (ఈచ్చిత లక్ష్మణ రావు రాసినది) తెలియచేస్తే సర్వదా కృతజ్ఞుడను....

    రిప్లయితొలగించండి

Blog Junctions