3, మార్చి 2011, గురువారం

సనాతనం-అధునాతనాల సమ్మిళితం ఈ పాట

సినిమా ఎలా వున్నా, ఈ మధ్యన విన్న పాటలలో తలమానీకం ఈ పాట. రామ జోగయ్య శాస్త్రి గారు వ్రాసిన ఆంగ్ల సాహిత్యం తో కూడిన  శివుని స్తోత్రాన్ని అధునాతన వాతావరణానికి తగినట్టుగా మలచిన మణిశర్మ గారికి జోహారులు. ఇటీవల మణిశర్మ గారి బృందం 'రాలీ, నార్త్ కరోలినా' వచ్చినపుడు లైవ్ ఆర్కెస్ట్రా తో ఈ పాట వింటుంటే ఒళ్ళు పులకించింది. కారుణ్య నల్లాన్ చక్రవర్తి, రమేష్ ఈ పాటను అద్భుతంగా పాడారు. చాల వెబ్ సైట్లలో చూసాను కాని సాహిత్యంలో చాల తప్పులు కనిపించాయి. అందువలన సంతృప్తిగా అనిపించలేదు. శివరాత్రి సందర్భంగా ఈ పాట సాహిత్యం దిగువన ఇస్తున్నాను.   

ఓం నమో శివ రుద్రాయ
చిత్రం: ఖలేజా
రచన: రామజోగయ్య శాస్త్రి
గాయకులు: కారుణ్య, రమేష్
సంగీతం: మణిశర్మ


ఓం నమో శివ రుద్రాయ
ఓం నమో స్థితి కంఠాయ
ఓం నమో హర నాగాభరణాయ, ప్రణవాయ
ఢమ ఢమ ఢమరుక నాదానందాయ
ఓం నమో నిటలాక్షాయ
ఓం నమో భస్మాంగాయ
ఓం నమో హిమశైలావరణాయ, ప్రమధాయ
ధిమి ధిమి తాండవ కేళీ లోలాయ

సదా శివా సన్యాసి తాపసి, కైలాసవాసి
నీ పాదముద్రలు మోసి పొంగి పోయినాదె పల్లె కాశి
ఏయ్! సూపుల సుక్కాని దారిగా
సుక్కల తివాసి నీదిగా
సూడ సక్కని సామి దిగినాడురా
ఏసెయ్ రా ఊరూ వాడా దండోరా

ఏ రంగుల హంగుల పొడ లేదురా
ఈడు జంగమ శంకర శివుడేనురా
నిప్పు గొంతున నిలుపు మచ్చ సాక్షిగా
నీ తాపం శాపం తీర్చే వాడేరా
పై పైకలా బైరాగిలా ఉంటాదిరా ఆ లీల
లోకాల నేలేటోడు నీకుసాయం కాకపోడు
ఏయ్! నీలోనే కొలువున్నోడు నిన్నుదాటి పోనెపోడు

Om Nama Shiva Jai Jai Jai
Om Nama Shiva Jai Jai Jai
Om Nama Shiva Groove To The Trance And Say 
Trance And Say
Sing Along Sing Shiv Shambo All The Way
Om Namah Shiva Jai Jai Jai
Heal The World Is All We Pray
Save Our Lives And Take Our Pain Away
Jai Jai Jai
Sing Along Sing Shiva Shambho All The Way

సదా శివా సన్యాసి తాపసి, కైలాసవాసి
నీ పాదముద్రలు మోసి పొంగిపోయినాదె పల్లె కాశి
ఏయ్ ఎక్కడ వీడుంటే నిండుగా 
అక్కడ నేలంతా పండగా
చుట్టు పక్కల చీకటి పెళ్లగించగా
అడుగేసాడంటా కాచే దొరలాగా
మంచును మంటను ఒక్క తీరుగా
లెఖ్ఖ సెయ్యనె సెయ్యని శంకరయ్యగా
ఉక్కు కంచెగ ఊపిరి నిలిపాడురా
మనకండాదండా వీడే నికరంగా
సామీ! అంటే హామీ తనై ఉంటాడురా చివరంటా
లోకాల నేలేటోడు నీకుసాయం కాకపోడు
ఏయ్! నీలొనె కొలువున్నోడు నిన్నుదాటి పోనెపోడు
Om Nama Shiva Jai Jai Jai
Om Nama Shiva Jai Jai Jai
Om Nama Shiva Groove To The Trance And Say
 
Trance And Say
Sing Along Sing Shiv Shambo All The Way
Om Nama Shiva Jai Jai Jai
Heal The World Is All We Pray
Save Our Lives And Take Our Pain Away Jai Jai Jai
Sing Along Sing Shiv Shambo All The Way


4 కామెంట్‌లు:

  1. నేను ఇప్పటి వరకూ ఆ పాట ఎన్ని సార్లు విన్న లిరిక్స్ పట్టుకో లేక పోయాను. ఇప్పుడు మీ బ్లాగ్ లో క్లియర్ గా చూడ గలిగాను. ఇప్పటికీ మీ బ్లాగ్ లో దాదాపు ప్రతి రోజూ ఈ పాట వింటున్నాను.

    రిప్లయితొలగించండి
  2. జయ గారికి ధన్యవాదాలు. మీకు పాట నచ్చినందుకు సంతోషం. చాల మంది లిరిక్సు పోస్టు చేస్తున్నారు కాని అవి సరిగ్గా ఉన్నాయా? లేవా? అని చూడటంలేదు. ఆ సాహిత్యం అందించిన కవులు ఎంత శ్రమ పడి రాసారో కదా. అందులో ఈ పాటలో మంచి సందేశం వుంది. సినిమా సరిగ్గా తియ్యలేదు గాని. అయితే మనిషిలో దేవుడిని చూడమన్నది సందేశం గాని మనిషినే దేవుడ్ని చేయమని కాదు. బహుశా దర్శకుడు చెప్పడం లో లోపమో లేక ప్రేక్షకులు అర్ధం చేసుకోవడంలో లోపమో సినిమా బొగ్గు అయ్యింది.

    రిప్లయితొలగించండి
  3. it is an excellent song played partly in telugu, and english...thanks for the song...kishen c.rao

    రిప్లయితొలగించండి

Blog Junctions