ఉద్యోగ రీత్యా ఉన్న ఊరు వదలి దేశం కాని దేశంలో చాల మంది స్థిర పడుతున్నాం. అయితే మన సంస్కృతి మనతో వచ్చినా అది మన పిల్లలకు అందించడంలో చాల ఇబ్బందులకు ఎదురవుతుంటాం. దైనందిన జీవితంలో వ్యవధి లేక, వ్యవధి వున్నా చెప్పగలిగే విజ్ఞానము లేక/చాలక సతమతమవుటుంటాం. అందులో పరాయి దేశంలో బోధన అంతా ఆంగ్లంలోనే కదా. అందువలన పిల్లలకు బాల విహార్ లు, బాల వికాస్ ల ద్వారా మన సంస్కృతిని బోధించే అవకాశం చాల నగరాలలో ఉంది. అయితే కొన్ని చిన్న ఊర్లలో ఆ అవకాశం కూడా లేదు. అయితే అందరికీ అందుబాటులో ఉండేది అంతర్జాలం (internet).
అందువలన ఇలాంటి పిల్లలకు అందుబాటుగా నిత్య దైవ ప్రార్థనలలో మనం స్మరించే కొన్ని శ్లోకాలను, వాటి అర్థం, తాత్పర్యం తో, కొంత వివరణతోను, మన సంస్కృతికి సంబంధించిన విషయాలను అందించడానికి ఆంగ్ల మాధ్యమంలో చేయబోతున్న ఒక చిన్న ప్రయత్నం ఈ క్రొత్త బ్లాగు "DEVOTION".
దీని URL: http://www.vulimiridevotion.blogspot.com
English blogs తాలూకు indexing sites తెలియక పోవడం వలన ఈ నా 'స్వగతం' బ్లాగు ద్వారా తెలియజేస్తున్నాను. ఈ బ్లాగులో మొదటి రెండు పోస్టుల లింకులు దిగువన ఇస్తున్నాను.
Meaning of Ganesha Shloka Suklambaradharam
Prayer Before Starting Learing/Education
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి