ఆశ మనిషికి ఊపిరి
ఊపిరి తొలిసారిగా తీసిన క్షణం
క్షణ భంగురమైన జీవితం ప్రారంభం
ప్రారంభమైన జీవన సమరంలో
సమరసాల సామరస్యం సంసారం
సంసారంలో సుఖ దుఃఖాలు
షడ్రుచుల సమ్మిళితాలు
పులుపు, తీపి, చేదు,
వగరు, ఖారం, ఉప్పు
ఏ రుచి ఎప్పుడు బాగుంటుందో చెప్పలేం
నచ్చని రుచులు ఒకోసారి తప్పనిసరి
మెచ్చే రుచులు రాకపోవు మరి
వికృత విరోధాలు ఎన్ని వచ్చినా
మళ్ళీ మంచి రోజులు వస్తాయనే ఆశ
ఆశ మనిషికి ఊపిరి
ఆశిద్దాం, ఆకాంక్షిద్దాం
అలాంటి మార్పు వస్తుందని
అందరికీ ఖర నామ సంవత్సర
ఉగాది శుభాకాంక్షలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి