31, జనవరి 2011, సోమవారం

ఓ బాపూ నీకు నీవే సాటి

1869-1948
"గాంధీ పుట్టిన దేశం రఘు రాముడు ఏలిన రాజ్యం ఇది సమతకు మమతకు సంకేతం" అని ఒకరంటే, ఇంకొకరు "గాంధి పుట్టిన దేశమా యిది నెహ్రు కోరిన సంఘమా ఇది సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా" అంటారు.  
      నాణానికి రెండువైపులు ఉన్నట్లు రేపటి వెలుగును చూస్తామన్న ఆశావాదం ఒకవైపు. నలుదిక్కుల ఆవరించిన కటిక చీకట్లు తప్ప అరుణ కిరణాలను చూడలేమన్న నిరాశావాదం మరొక వైపు. 
      అప్పటికీ ఇప్పటికీ ఏం తేడా లేదు. అసలు ఎప్పటికీ మార్పు రాదు. నీ బొమ్మకు దండవేసి చేతులు దులుపుకునే రాజకీయం నిన్ననుసరించాలని అనుకోదు. అదంతా ఒక పబ్లిసిటీ స్టంటు.  
      ఈ ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలన్న నీవంటి మహాత్ముడిని  అయిదు సార్లు నిరాకరించింది నోబెల్ సంస్థ నీకు పురస్కారం ఇవ్వడానికి. ఇలాంటి సంస్థ ఉంటేనేం లేకుంటే ఏం? అసలు నిన్ను తిరస్కరించిన నాడే పడిపోయింది దీని విలువ. 
      "మహాత్ముడే కలలుగన్న మరో ప్రపంచం" కేవలం ఒక కల మాత్రమే అనిపిస్తుంది. అధికారం కోరకుండా ప్రజా సేవ చేసే వారు ఈ కాలంలో లేరు. ఎందఱో నకిలీలు ఈ రోజు నీ పేరు చెప్పుకుని బతికేస్తున్నారు. నిజమైన గాంధేయ వాదులు అపుడో కాలం చేసారు. 
      ఎవరు నిన్ను, నీ ఆశయాలను ఆదరించినా లేకపోయినా ఓ బాపూ నీకు నీవే సాటి. నీవు నుడివిన వాక్కులు 
"రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం
ఈశ్వర అల్లా తేరే నామ్ సబ్ కో సన్మతి దే భగవాన్" 
అనేవి అక్షర సత్యాలు. నీ వర్ధంతి నాడు ఇవే నా అశ్రు నివాళులు. అందుకో ఓ బాపూ!

5 కామెంట్‌లు:

  1. Great Article on the Mahatma. I feel Noble Peace prize should be renamed as Gandhi Peace Prize. Gandhi is the Face of the Peace Movement.

    రిప్లయితొలగించండి
  2. పవిత్రబంధం
    సంగీతం::S.రాజేశ్వరరావ్
    రచన::శ్రీ శ్రీ
    గానం::ఘంటసాల


    గాంధి పుట్టిన దేశమా ఇది?నెహ్రు కోరినా సంఘమా ఇది?
    గాంధి పుట్టిన దేశమా ఇది?నెహ్రు కోరినా సంఘమా ఇది?
    సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా..
    గాంధి పుట్టిన దేశమా...

    సస్యశ్యామల దేశం..అయినా నిత్యం క్షామం
    సస్యశ్యామల దేశం..అయినా నిత్యం క్షామం
    ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రంపాలు
    యువకుల శక్తికి భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు
    ఉన్నది మనకూ ఓటూ..బ్రతుకు తెరువుకే లోటూ...

    గాంధి పుట్టిన దేశమా ఇది?నెహ్రు కోరినా సంఘమా ఇది?
    సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా ఇది...
    గాంధి పుట్టిన దేశమా..

    సమ్మె ఘెరావూ దొమ్మీ..బస్సుల దహనం లూఠీ
    సమ్మె ఘెరావూ దొమ్మీ..బస్సుల దహనం లూఠీ
    శాంతీ సహనం సమధర్మంపై విరిగెను గూండా లాఠీ
    అధికారంకై పెనుగులాటలో అన్నాదమ్ముల పోటీ
    హెచ్చెను హింసాద్వేషం..ఏమవుతుందీ దేశం?

    గాంధి పుట్టిన దేశమా ఇది?నెహ్రు కోరినా సంఘమా ఇది?
    సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా ఇది...
    గాంధి పుట్టిన దేశమా????

    వ్యాపారాలకు పర్మిట్వ్య..వహారాలకు లైసెన్స్
    అర్హతలేని ఉద్యోగాలూ లంచం ఇస్తే ఓయెస్
    సిఫార్సు లేనిదె శ్మశానమందూ దొరకదు రవ్వంత చోటు
    పేరుకి ప్రజలది రాజ్య పెత్తందార్లదె భోజ్యం

    గాంధి పుట్టిన దేశమా ఇది?నెహ్రు కోరినా సంఘమా ఇది?
    సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా ఇది?
    గాంధి పుట్టిన దేశమా????

    రిప్లయితొలగించండి

Blog Junctions