31, జులై 2011, ఆదివారం

గ్రాడ్యువేషన్ కెందుకురా తొందర?

అమెరికాలో ఇది గ్రాడ్యు వేషన్ల సీజనిది. అయితే ప్రస్తుత ఆర్ధిక పరిస్థితి బాగులేదు. "దేశం క్లిష్ట పరిస్థుతులలో వుంది". ఇది ఒక్కప్పటి నూతన్ ప్రసాదు డైలాగు అనుకుంటాను.  ఈ నేపధ్యంలో సరదాగా ఒక పేరడీ. దీనికి మూలం ఎ.ఎన్.ఆర్. నటించిన 'అందాల రాముడు' లోని 'ఎదగడాని కెందుకురా తొందరా' కు పేరడీ.

గ్రాడ్యువేషన్ కెందుకురా తొందర?
ఎదర ఎకానమీ చిందర వందర 
సో సో లైఫే 

గ్రాడ్యువేటివి అయ్యాక జాబంటూ వెదకాలి
ఇంటర్ నెట్టంటూ సెర్చింజన్ వెనకే పరిగెత్తాలి 
రెజుమేల రైన్ బో ని అస్త్రం లా వదలాలి 
ఇంటర్ వ్యూ అంటూ, క్యూ అంటూ హెడ్ హంటర్ వెదకాలి 
జాబు రిక్వైర్ మెంట్స్   నీకున్నాఅవి   వేస్టురా 
నువ్వు నెట్ వర్కింగ్ లేకెపుడూ లాస్టురా
ఫ్రీ లోడింగ్ ఇల్లే నీ నెస్టు రా ... అందాకా   ||గ్రాడ్యువేషన్||


కంప్యూటర్ కోర్సు చదివి కాంట్రాక్టరు పనికెళితే
క్రేష్ కోర్సుల కేండిడేట్లు  సిద్ధము 
నువ్వు చేయలేవు వాళ్ళతో యుద్ధము 
డిగ్రీ నువ్వు తెచ్చుకున్నా, క్రేడెన్షియల్స్  నీకున్నా 
ఫేక్ రెజుమేగాళ్ళ ముందు వ్యర్థము  
నీకు షాక్ తగిలితె అది నీ ప్రారబ్ధము 
ఈ ఎకానమీ సునామీర సోదరా 
ఏమీ తేల్చని ఈ కాంగ్రెస్ ఒక బాధరా
నీ డ్రీములన్ని ఎప్పుడు నిజమౌనురా...అందాక   ||గ్రాడ్యువేషన్||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Blog Junctions