4, అక్టోబర్ 2011, మంగళవారం

తన కిరణాలతో అద్భుతాలు చేసే అరసవిల్లి దేవుడు

అరసవిల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి వారు
ఆంద్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం సమీపంలో గల అరసవిల్లి పుణ్యక్షేత్రం లో ప్రతి ఏటా రెండు సార్లు ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది. అదేమిటంటే, సంవత్సరంలో రెండు రోజులలో మాత్రం ప్రభాత భాస్కరుని కిరణాలు నేరుగా ఆలయం ముఖ ద్వారం నుండి ప్రవేశించి స్వామి వారైన ఉషా, చాయా, పద్మినీ సమేత శ్రీ సూర్య నారాయణ స్వామి వారి పాదాలను తాకుతాయి. ఈ ఘట్టం ఉదయం 6.00 నుండి 6.15 మధ్య కేవలం ఒక అయిదు నిముషాలు మాత్రమె వుంటుంది. తదుపరి సూర్య కిరణాలు గర్భ గుడి నుండి నిష్క్రమిస్తాయి. ఈ అద్భుతాన్ని చూడడానికి ఎందఱో స్థానిక భక్తులు, దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఆలయానికి వేకువనే వచ్చి ఈ వింత చూడటానికి ఎదురు చూస్తారు. సుమారు ఏడవ శతాబ్దంలో ఈ కోవెలను సూర్యుని గమనాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మించడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, మార్చిలో, అక్టోబరు లో వచ్చే ఈ శుభ దినాలు ఉత్తరాయనాన్ని, దక్షిణాయనాన్ని సూచిస్తాయి. ఈ దినం ప్రసరించే సూర్య కిరణాలలో శరీర ఆరోగ్యాన్ని మెరుగు పరచే మహిమ వుందని అందరి భక్తుల నమ్మకం.  ఆ విధంగా ప్రత్యక్ష దైవమైన సూర్యుడు తన కిరణాలతో అద్భుతాలు చేస్తూ ప్రాణికోటి కంతటికీ జీవనాధారమౌతున్నాడు.  

దిగువన యూ ట్యూబ్ వీడియోలలో నిన్న-మొన్నటి, మరియు ఇంతకు ముందు అరసవిల్లి కోవెలలో తీయబడిన వీడియోలు ఈ అద్భుతాన్ని తెలుపుతాయి.   

అక్టోబరు 1, 2011



మార్చ్ 2011




సప్తాశ్వ రథమారూఢమ్ ప్రచండమ్ కశ్యపాత్మజమ్ 
శ్వేత పద్మధరమ్ దేవమ్ తమ్ సూర్యమ్ ప్రణమామ్యహమ్  

1 కామెంట్‌:

Blog Junctions