29, జనవరి 2012, ఆదివారం

జన్మదిన శుభా కాంక్షలతో వేటూరికి దృశ్య గీతాంజలి

పుంభావ సరస్వతి, తెలుగు సినీ పదబ్రహ్మ శ్రీ వేటూరి సుందర రామ్మూర్తి గారి 76 వ జన్మదినం ఈ రోజు. శ్రీ వేటూరి గారు ఎన్నో మధురమైన గీతాలను మనకు అందించారు. అందులో భావ గీతాలు, భక్తి గీతాలు, చిలిపి పాటలు, అల్లరి పాటలు, విరహ గీతాలు, విషాద గీతాలు, వినోద గీతాలు, విలాస గీతాలు ఒకటేమిటి, ఆయన కలానికి అందని రసం లేదు. ఎనిమిది సార్లు నంది అవార్డులు, ఒకసారి జాతీయ అవార్డు అందుకున్న శ్రీ వేటూరి వారి గురించి ఎంత వ్రాసినా తక్కువే. శ్రీ వేటూరి గారి జన్మదినం సందర్భంగా రెండు టీవీ ఛానళ్ళు సమర్పించిన వీడియోలను ఇక్కడ పొందుపరుస్తున్నాను.

వనితా టీవీ షోస్
మొదటి భాగం


రెండవ భాగం

మూడవ భాగం 

మరొక నివేదిక - టీవి-9
మొదటి భాగం

రెండవ భాగం 
 

3 కామెంట్‌లు:

  1. ఈ announcer మాట్లాడి మాట్టాడి, నా హృదయ పలకాన్ని తాకి, దాన్ని కుల్లగొట్టింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కర్ గారు, మీతో పూర్తిగా ఏకీభవిస్తాను. నాకూ అలానే అనిపించింది. అయితే ఆ మహానుభావుడ్ని గుర్తు చేసుకోవడమే ఇక్కడ ముఖ్య ఉద్దేశం. కొన్ని విషయాలు మన చేతులలో లేవు. వెరసి వేటూరి గారి గురించి మళ్ళా విని ఆనదించడమే మనం చేయగలిగినది. మీ స్పందనకు ధన్యవాదాలు.

      తొలగించండి
  2. మిత్రులు భాస్కర్ కొంపెల్ల చెప్పినట్లు ఆయన "కవి దళానికి కులపతి, కవి కులానికి దళపతి, సారస గేయ స్ఫూర్తి - సుందర రామ్మూర్తి - ఇలాంటి గాన సరస్వతి న భూతో న భవిష్యతి"

    రిప్లయితొలగించండి

Blog Junctions