4, మార్చి 2012, ఆదివారం

టోరి (Tori) ఏప్ తో పాత, కొత్త తెలుగు పాటలు 24 గంటలు స్మార్ట్ ఫోన్ లో వినొచ్చు

నా చిన్నప్పుడు కేవలం రేడియో ఒక్కటే సాధనం పాటలు వినడానికైనా, సంక్షిప్త శబ్ద చిత్రాన్ని వినడానికైన.  అప్పటికీ ఇప్పటికీ ఎంతో పురోగామించాం సాంకేతికంగా. ఇది సాంఖ్యిక (డిజిటల్) యుగం.  ఇప్పుడు అంతా జాలం (net) లో వుంది. ఇది అంతర్జాల (internet) మహిమ.  మనకు ఉపాధి కోసం అందరూ భౌతికమైన ఎల్లలను చెరిపేశారు లేదా అధికమించారు. ఉద్యోగ పరంగా తెలుగు వారు దేశ, విదేశాలు తిరుగుతున్నారు. అయితే మన తెలుగును మరచి పోవడం లేదు.  నాకు నచ్చిన ఒక  గ్లోబల్ రేడియో అప్లికేషన్ (ఏప్) "టోరి" (TORI). ఇది Android లో వుంది. iPhone లో వుందో, లేదో తెలియదు. ఈ ఏప్ చాల బాగుంది. Free installation ap. ఈ ఏప్ తో పాత తరం, కొత్త తరం తేడా లేకుండా అన్ని తెలుగు పాటలు 24 గంటలు ప్రసారం చేసే గ్లోబల్ రేడియో. అంతే కాదు ఏ దేశం నుంచైనా వినొచ్చు ఈ ఏప్ వుంటే.  మీరు కూడా download చేసుకుని ఆనందించండి. Android Smartphone aps లో market place కు వెళ్లి search లో "tori" type చేస్తే దొరుకుతుంది. చాల మందికి తెలిసి ఉండొచ్చు దీని గురించి. కాని తెలియని వారు కూడా ఉంటారని ఈ సమాచారం వ్రాయాలనిపించింది.

Disclaimer: This is for your information only. I am not doing any publicity for TORI.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Blog Junctions