23, నవంబర్ 2010, మంగళవారం

వినాయకుడికి అన్ని దంతాలు ఎలా వచ్చాయి?

ఏంటో విఘ్నాలకు అధిపతి గాని, ఆయన్ను తలచుకోగానే అన్ని సందేహాలు వస్తాయి పిల్లలకు. పిల్లలు అడుగు తుంటారు. నాన్నా! నాన్నా! వినాయకుడు ఏక దంతుడు కదా! మరి అనేక దంతం అన్నావెందుకు?
అసలు విషయానికి వస్తే....గజ ముఖుడైన వినాయకునికి రెండు దంతాలు ఉండేవి, మనలా ముప్ఫై రెండు కాకుండా. అయితే వినాయకుడు ఏకదంతుడు ఎలా అయ్యాడు? ఒక పురాణ కథ ప్రకారం, వ్యాస మహర్షి మహా భారతాన్ని చెబుతుండగా వినాయకుడు వ్రాసుకుంటూ పోతున్నాడు. అయితే వారి మధ్య ఒక ఒప్పందం ఉంది. వినాయకుడు వ్యాసుణ్ణి మీరు ఆపకుండా చెబుతుండాలి అని నిర్దేశించాడు. అప్పుడు వ్యాసుడు వినాయకునితో "నేను చెప్పినది పూర్తిగా అర్ధం చేసుకున్న తరువాతే వ్రాయాలి" అని చెప్పి కష్టమైన సంస్కృత సమాసాలతో చిలవల పలవల శ్లోకాలని చెప్పడం మొదలు పెడతాడు. అవి అర్ధం చేసుకుని వ్రాయడానికి గణేశునికి కొంత సమయం పట్టేది. ఆ అదనపు సమయంలో వ్యాసుల వారు తీరికగా తరువాతి శ్లోకం గురించి ఆలోచించేవారు. సరే గణేశుల వారు వ్రాయడం మొదలు పెట్టారు. కాని మధ్యలో ఘంటం మొరాయించి వ్రాత ఆగి పోయే ప్రమాదం ఏర్పడింది (బహుశా ఇంకు అయిపోయిందేమో). కాని సమయాభావం కాకుండా వినాయకుడు తన ఒక దంతాన్ని విరిచి అవిఘ్నంగా భారతం వ్రాయడం పూర్తి చేసాడట. ఆ కారణంగా వినాయకు
డు  ఏక దంతుడు అయ్యాడు.  అయితే ఈ క్రింది శ్లోకం చూడండి.

అగజానన పద్మార్కం గజాననమహర్నిశం

అనేకదం తం భక్తానాం ఏక దంతముపాస్మహే!


అయితే పిల్లలకు చెప్పినప్పుడు, చదివేటప్పుడు చాల మంది ఈ శ్లోకాన్ని "అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే" అని చదువుతుంటారు. ఒకే శ్లోకంలో ఏకదంతుని 'అనేక దంతం' అనడం తో ఇంతకూ వినాయకునికి చాల దంతాలు ఉన్నట్టున్నాయనిపిస్తుంది. ఇది ఎలాటిదంటే "రాముని తోక పివరున్డిట్లనియే" లాంటిదే.  మరి పిల్లలకు సందేహం రావడం లో ఆశ్చర్యం లేదు. అనేక దంతుడా? లేక ఏక దంతుడా? అందువలన పదాల విరుపులో జాగ్రత్తగా వుండాలి.  'అనేక దంతం' కాదు. "అనేక దం తం భక్తానాం" అని పలకాలి.


పద విభజన:
అగజ+ఆనన  పద్మ+ఆర్కం   గజ+ఆననం+అహః+నిశం 
అనేక దం తం భక్తానాం ఏక దంతం+ఉపాస్మహే
 

ప్రతి పదార్ధంఅగజ = పార్వతి;  '' అంటే గమించేది లేదా చలించేది. 'అగము' = గమించ లేనిది లేదా చలించలేనిది (అనగా అచలమైనది) ఈ సందర్భంలో 'కొండ' లేదా 'పర్వతం' అని అర్ధం. ఉదా. వెంకటాచలం. '' అంటే పుట్టినది. 'అగజ' అంటే కొండ లేదా పర్వతము నకు పుట్టినది. పర్వత రాజు కుమార్తె లేదా పర్వత తనయ ...ఎవరూ? పార్వతి. అమ్మయ్య .. అలా వచ్చిన పేర్లే ..హిమజ (హిమగిరి తనయ), గిరిజ (గిరి తనయ). ఆనన = ముఖము; పద్మ = కలువ; ఆర్కం = సూర్యుడు; అగజానన పద్మార్కం = పార్వతీ దేవి ముఖము సూర్యుని చూసి వికసించిన పద్మం లా వుంది. దేనిని చూసి? గజ = ఏనుగు; ఆననం = ముఖము; అహః = దినము/పగలు; నిశం = రాత్రి; గజాననమహర్నిశం = వినాయకుని ముఖమును పగలు-రాత్రి చూడడం వలన; అనేక = చాల; దం =  ఇచ్చునది/ఇచ్చువాడు (వరములు) ; తం = అతనిని; భక్తానాం = భక్తుల కొరకు; ఏక = ఒకే; దంతం =  పన్ను/దంతము గల; ఉపాస్మహే = ఉపాసింతును/పూజింతును.
   
తాత్పర్యం: గజాననుని పగలు రాత్రి చూస్తున్న పార్వతీ దేవి ముఖము..సూర్యుని చూసిన పద్మము వలె వికసించినది. అన్ని వరములను తన భక్తులకు ఒసగే ఆ ఏకదంతుని (వినాయకుని) ప్రార్థించెదను.

12 కామెంట్‌లు:

  1. అబ్బ భలే చెప్పారండీ...ఇన్నాళ్ళూ ఆ శ్లోకం చదవడమేకానీ దాని తాత్పర్యం ఇప్పుడే తెలిసింది.ధన్యవాదాలు :)

    రిప్లయితొలగించండి
  2. సూరి గారూ !
    నిత్యం వినే శ్లోకాలకు మంచి వివరణలు ఇస్తూ అనేక మందికి మదిలో వుండిపోయిన సందేహాలు తొలగిస్తున్నారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. ఇందు గారు, రవి గారు, రాం గారు, రావు గారు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  4. చాలా బాగా వివరించారు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  5. SUNA

    very proud of you. Fantastic poem on Ghantasala!!
    I know how much you like Ghantasala from our college days. Look forward to seeing more form you.

    Umesh

    రిప్లయితొలగించండి
  6. ధన్యవాదాలు ఉమేశ్. అయితే ఈ వ్యాఖ్య ఇంకొక పుటకి సంబంధించినది. అలవాటులో పొరపాటు.

    రిప్లయితొలగించండి

Blog Junctions