20, ఆగస్టు 2011, శనివారం

జన గణమన పూర్తి గీతం - 39 మంది ప్రముఖ గాయనీ గాయకుల గళాలలో

ఇదేమిటి స్వాతంత్ర్య దినోత్సవం అయిన నాలుగు రోజులకు గుర్తొచ్చిందా ఈ శీర్షికపై బ్లాగు వ్రాయడానికి అనుకోవచ్చు. కాని ఇప్పుడే ఈ గీతం గురించి తెలిసింది. అందరికి తెలుసు మన జాతీయ గీతమైన  "జనగణమన అధినాయక జయహే! భారత భాగ్య విధాత!" రచించినది విశ్వకవి, నోబెల్ బహుమతి గ్రహీత శ్రీ రవీంద్ర నాథ్ టాగోర్ (1861-1941) అని. అయితే ఆయన వ్రాసిన ఈ గీతం లో అయిదు చరణాలు ఉండగా కొన్ని రాజకీయ కారణాల వలన కేవలం ఒకే చరణాన్ని మాత్రమె మన జాతీయ గీతం లో చేర్చడం జరిగింది. మరొక విషయం ఏమిటంటే ఈ గీతానికి బాణీ కూర్చడం తెలుగు నేలపై జరిగింది, అది శ్రీ టాగోర్ గారు మదన పల్లె సందర్శించిన తరుణంలో.

ప్రస్తుతం శ్రీ టాగోర్ 150 వ జన్మ దినం సందర్భంగా ఆయన వ్రాసిన ఈ గీతం భారతమాత ముద్దు బిడ్డలయిన 39 మంది కళాకారులు, ఎక్కువగా గాయనీ గాయకులూ, కొద్ది మంది వాద్య సంగీతజ్ఞులు పాల్గొన్న ఈ వీడియో ఆగస్ట్ 12, 2011 న, అంటే స్వాతంత్ర్య దినోత్సవానికి మూడు రోజుల ముందు "జయ హే! " అన్న పేరుతో  "Times of India" విడుదల చేసింది. చరణాల మధ్య ఆంగ్ల వ్యాఖ్యానం ఆయా చరణాల అర్ధాన్ని వివరిస్తూ చక్కగా వుంది. ప్రతి ఒక్కరు తప్పని సరిగా చూడవలసిన రికార్డింగు ఇది. ఈ గీతం మౌలికంగా వంగ భాషలో వ్రాయగా (ఎక్కువ సంస్కృత పదాలున్నాయి), సాహిత్యాన్ని 'వికి పీడియా' నుండి సేకరించి వీలయినంత విని పదాలను సరిదిద్దాను. కాని కొన్నిసవరణలు ఉంటే సూచించగలరు. ఈ గీతం ఇన్ని గళాలలో వింటుంటే ఒళ్ళు ఆనందంతో పులకరించింది. ఏదో తెలియని మధురానుభూతి కలిగింది. ఇప్పుడున్న అన్ని సమస్యలు మరచి పోయి అంతా సామరస్యం తో ఆలోచిస్తే అందులో ఎంత హాయి ఉంటుందో తెలుస్తుంది.  ఆ ఆశాభావంతో ఈ గీతం వినండి.



గాయనీ గాయకులు, వాద్య విద్వాంసులు: కవితా కృష్ణమూర్తి, ఉస్తాద్ గులామ్ ముస్తఫా ఖాన్, గిరిజా దేవి, ఉషా ఉతుప్, హరిహరన్, అల్కా యాజ్ఞిక్, సురేష్ వడేకర్, పండిత్ జస్‍రాజ్, సునిధి చౌహాన్, కైలాశ్ ఖేర్, రేఖా భరద్వాజ్, రూప్ కుమార్ రథోడ్, సునాలి రథోడ్, సౌమ్యొజిత్ దాస్, సౌరెంద్రొ మల్లిక్, పండిత్ శివ్ కుమార్ శర్మ, చిత్ర, జగ్‍జీత్ సింగ్, నిత్యశ్రీ మహదేవన్, శ్రీనివాస్, పి. సుశీల, సోను నిగమ్, పండిత్ విశ్వ్ మోహన్ భట్పండిత్ అజొయ్ చక్రబర్తి, రిచా శర్మ, మహలక్ష్మి అయ్యర్, శంకర్ మహదేవన్, డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, డా. ఎల్. సుబ్రహ్మణ్యమ్, అంబి సుబ్రహ్మణ్యమ్, పండిత్ హరిప్రసాద్ చౌరాసియా, సాధనా సర్‍గమ్, జావేద్ ఆలి, లెస్లే లెవిస్, లక్ష్మణ్ దాస్ బౌల్, లోపాముద్ర మిత్ర, శ్రీకాంత్ ఆచార్య, శ్రాబణి సేన్, షాన్.   (పేర్లు వీడియోలో కళాకారులు కనిపించే వరుస క్రమంలో)      
  సంపూర్ణ జాతీయ గీతం
జయ హే! జయ హే! జయ హే! జయ హే! జయ హే! జయ హే! జయ హే! 
చ1.   జనగణమన అధినాయక జయ హే! భారత భాగ్య విధాతా
       పంజాబ్, సింధు, గుజరాత, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగా
       వింధ్య హిమాచల యమునా గంగా, ఉచ్ఛల జలధి తరంగా
       తవ శుభనామే జాగే, తవ శుభ ఆశిష మాగే
       గాహే తవ జయ గాథా
       జనగణ మంగళదాయక జయ హే! భారత భాగ్య విధాతా
       జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!

చ2.  అహరహ తవ ఆహ్‍బాన్ ప్రచారిత, శుని తవ ఉదార వాని(ణి)
       హిందు, బౌద్ధ్, శిఖ్, జైన్, పారశిక్, ముసల్మాన్, క్రిస్తాని
       పూరబ్ పశ్చిమ ఆశే, తవ సింఘాసన పాశే
       ప్రేమ్ హార్ హొయె గాథా
       జనగణ ఐక్య విధాయక జయ హే! భారత భాగ్య విధాతా
       జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!

చ3.  పతన అభ్యుద్దయ్ బన్ధుర్ పంథా, యుగ్ యుగ్ ధావిత యాత్రి
       హే చిరొ సారొథి, తవ రథ్ చక్రే, ముఖరిత పథ్ దిన్ రాత్రి
       దారుణ విప్లవ మాఝే, తవ శంఖధ్వని బాజే
       సంకట దుఃఖ త్రాతా
       జనగణ పథ్ పరిచాయక జయ హే! భారత భాగ్య విధాతా
       జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!

చ4.  ఘోర తిమిర్ ఘన నిబీడ నిశీథే, పీడిత మూర్చిత దేశే
       జాగృత ఛిల తవ అవిచల మంగళ, నత నయనే అనిమేషే
       దుస్స్వప్నే ఆటంకే, రక్షా కరిలే అంకే
       స్నేహమయి తుమి మాథా
       జనగణ దుఃఖ త్రయకా జయ హే! భారత భాగ్య విధాతా
       జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!

చ5.  రాత్రి ప్రభాతిలా ఉదిల రవిఛావి, పూర్వ ఉదయగిరి భాలే
       గాహే విహంగమ్ పుణ్య సమిరన్, నవ జీవన రస్ ఢాలే
       తవ కరుణారుణ రాగే, నిద్రిత భారత జాగే
       తవ చరణె నత మాథా
       జయ జయ జయ హే! జయ రాజెశ్వర్, భారత భాగ్య విధాతా
       జయహే! జయహే! జయహే! జయ జయ జయ జయహే!
జైహింద్ 

10 కామెంట్‌లు:

  1. అద్భుతమైన పోస్టు పెట్టారు. ఇప్పటివరకు ఆలపిస్తున్న జాతీయగీతం మొత్తం , దాని అర్ధం తెలిసింది .

    రిప్లయితొలగించండి
  2. Thanks so much for sharing this video Sury garu, This song never fails to rejuvenate ones spirit, even the short version... Listening to the original full version was awesome!!! A great video to share with kids...

    రిప్లయితొలగించండి
  3. మంచి సమాచారాన్ని అందించావు పాట చాల బాగున్నది.నీకు ధన్యవాదాలు
    ఈ విషయాన్ని మా డాక్టర్ల సమావేశం లొ ప్రస్తావించాను.

    రిప్లయితొలగించండి
  4. మన జాతీయ గీతం ఉంతపెద్దదా? ఇదివరకు తెలియదు. తెలియజేసినందుకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి

Blog Junctions