28, నవంబర్ 2010, ఆదివారం

సత్యనారాయణ పూజ హారతి పాట

ఏదైనా వ్రతం చేసుకున్నపుడు మంగళ హారతి ఇచ్చే సమయంలో ఏదో భక్తి పాట పాడే బదులు వ్రతానికి తగ్గ హారతి పాటయితే బాగుండుననిపిస్తుంది. అయితే అలాంటి పాట టక్కున గుర్తుకు రాదు. గుర్తొచ్చినా సాహిత్యం గుర్తుండదు.  సత్యనారాయణ వ్రతం కి సంబంధించిన శ్రీమతి పి. సుశీల పాడిన ఈ హారతి పాట సాహిత్యం ఇక్కడ వ్రాస్తున్నాను. 



శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా

చిత్రం: గృహ ప్రవేశం
రచన: దాశరథి
సంగీతం: సత్యం
గానం: పి. సుశీల

ప:శ్రీసత్యనారాయణుని సేవకు రారమ్మా..
    మనసారా స్వామిని కొలిచి
హారతులీరమ్మా.. |శ్రీ సత్య| 
    నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన ఫలము ||శ్రీసత్య||

చ:స్వామిని పూజించే..చేతులె చేతులటా..
    ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులటా |ఆ..ఆ..|స్వామిని|
    తన కథ వింటే ఎవ్వరికైన జన్మ తరించునటా.. ||శ్రీసత్య||

చ:యే వేళైనా..యే శుభమైనా..
    కొలిచే దైవం.. ఈ దైవం..|ఆ..ఆ..|యే వేళైనా|
    అన్నవరంలో వెలసిన దైవం..ప్రతి ఇంటికి దైవం..||శ్రీసత్య||

చ:అర్చన చేదామా..మనసు అర్పణ చేదామా..
    స్వామికి మదిలోనే కోవెల కడదామా..|ఆ..ఆ..|అర్చన|
    పదికాలాలు పసుపుకుంకుమలు ఇమ్మని కోరేమా..||శ్రీసత్య||

చ:మంగళమనరమ్మా...జయమంగళమనరమ్మా..
    కరములు జోడించీ...శ్రీచందనమలరించీ..|ఆ..ఆ..|మంగళ|
    వందనమనరే సుందరమూర్తికి వందనమనరమ్మా ||శ్రీసత్య||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Blog Junctions