27, నవంబర్ 2010, శనివారం

ఈనాటి పిల్లలను కూడా స్పందింప జేసే ఆనాటి పాట

పాటంటే ఇంత మధురంగా వుండాలి.  భజన అంటే ఇలా ఉండాలి.  విన్న కొద్దీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించాలి.  చిన్నప్పుడు ఈ పాట ఎన్ని సార్లు విన్నానో తెలియదు. ఎ.వి.ఎం వారి భక్త ప్రహ్లాద సినిమా ఎన్ని సార్లు చూసానో లెఖ్ఖ లేదు. రోజా రమణి ప్రహ్లాదుని వేషం లో తెలుగు వారందరి హృదయాలలో చిరస్థాయిగా మిగిలిపోయింది. అంత చిన్న వయసులో ఆరిందా లా అభినయం చేస్తూ అంతో అద్భుతంగా నటించింది. ఇప్పటికి ఈ పాట వింటే మనసంతా పులకించి మధుర భావాలను గుర్తు చేసి నా బాల్యంలో కి తీసుకు పోతుంది. ఈ మధ్యనే ఒక స్నేహితుని పాప ఈ పాట పాడగా విన్నాను. ఈనాటికీ ఆ పాట ఇప్పటి తరం కూడా ఈ పాటకు ప్రభావితులవుతున్నారంటే ఆశ్చర్యం ఆనందం కలిగాయి. తెలియని వారి సౌలభ్యం కోసం ఈ పాట సాహిత్యం ఇక్కడ ఇస్తున్నాను.
 
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
చిత్రం: భక్త ప్రహ్లాద
గాయని: పి. సుశీల & బృందం
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు

ఓం నమో నారాయణాయ....ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ....ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ....ఓం నమో నారాయణాయ
నారాయణ మంత్రం శ్రీ మన్నారాయణ భజనం (2)
భవ బంధాలు పారద్రోలి పరము నొసంగే  సాధనం
నారాయణ మంత్రం శ్రీ మన్నారాయణ భజనం (2)

చరణం:

గాలిని బంధించి హఠించి గాసిల పనిలేదు (2)
జీవుల హింసించి క్రతువుల చేయగ పని లేదు (2)
మాధవా మధుసూదనా అని మనసున తలచిన చాలుగా (2)
నారాయణ మంత్రం శ్రీ మన్నారాయణ భజనం (2)

తల్లియు తండ్రియు నారాయణుడే
గురువూ చదువూ నారాయణుడే
యోగము యాగము నారాయణుడే
ముక్తియు దాతయు నారాయణుడే
భవ బంధాలు పారద్రోలి పరము నొసంగే సాధనం
నారాయణ మంత్రం శ్రీ మన్నారాయణ భజనం (2)

నాద హరే శ్రీ నాద హరే నాద హరే జగన్నాథ హరే (2)

నాద హరే శ్రీ నాద హరే (2)
నాద హరే జగన్నాథ హరే (2) 


కొన్ని అర్థాలు: హఠించి = మూర్ఖత్వం లేదా మొండితనం చూపించి; క్రతువు = బలి, యజ్ఞం; గాసిల = ?; పరము = మోక్షం; 

2 కామెంట్‌లు:

  1. మా బాబుకి కూడా చాలా ఇష్టం. రచన ఇచ్హినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. గీత యశస్వి గారికి, ధన్యవాదాలు, అమెరికాలో ఉంటున్న ఒక చిన్నపాప ఈ పాట తనకు ఎంతో ఇష్టమని అయితే సాహిత్యం సరిగ్గా తెలియదని అంటే ఈ పాట పోస్ట్ చేసాను. నాక్కూడ ఎంతో ఇష్టం ఈ పాట చిన్నప్పటినుండి.

    రిప్లయితొలగించండి

Blog Junctions