16, మే 2011, సోమవారం

నేడే నృసింహ జయంతి

నేడు (మే 16, 2011) నరసింహ లేదా నృసింహ జయంతి.  శ్రీ మహా విష్ణువు అవతారాలలో నాలుగవది నరసింహావతారం.  శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు అహోబల నరసింహ స్వామి పై చాల కీర్తనలు రచించాడు. నరసింహ అవతారం, ప్రహ్లాద చరిత్ర చాల అద్భుతంగా ఉంటాయి.

శ్రీ హరి ద్వార పాలకులైన జయవిజయులు శాప వశాన భూమి పై రాక్షసులుగా జన్మిస్తారు. అయితే ఏడు జన్మలు హరి భక్తులుగ కావలెనా లేక మూడు జన్మలు హరి ద్వేషులుగా కావలెనా అన్న శ్రీహరి సూచనకు, విష్ణు సేవకు దూరమవుతున్నామన్న బాధ వలన ద్వేషించినా మూడు జన్మలైతే తక్కువ కాలములో తిరిగి విష్ణు సన్నిధికి చేరవచ్చన్న తలంపుతో వారు మూడు జన్మల ఎడబాటు కోరుతారు. ఆ విధంగా జయవిజయులు మొదటి జన్మలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడుగ పుడతారు. 

శ్రీహరి వరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు. దానితో హిరణ్య కశిపుడు శ్రీహరి పై ద్వేషం పెంచుకుని ప్రతీకారం తీర్చు కోవడం కోసం బ్రహ్మను మెప్పించి తనను పగలు గాని, రాత్రి గాని, ఇంటి బయట గాని, ఇంటి లోపల గాని, భూమి మీద కాని, ఆకాశంలో గాని, అస్త్రం చే గాని, శాస్త్రం చే గాని, మనిషి చేత గాని, మృగం చేత గాని చంపబడకుండా ఉండాలనే వింత షరతులతో కూడిన వరం పొందుతాడు. హిరణ్య కశిపుని కుమారుడు ప్రహ్లాదుడు నారద బోధచే తల్లి గర్భం లో నున్నప్పటి నుంచే హరి భక్తుడు అవుతాడు. హరి భక్తి మానమని ప్రహాదుని ఎంత బోధించినా, బెదరించినా, చంప ప్రయత్నించినా మనసు మార్చుకోడు. ఆఖరికి శ్రీ హరి ని చూపగలవా అని ఒక స్తంభమును చూపించి హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని నిలదీస్తే "ఇందు గలడందు లేదని సందేహము వలదు .." అని తండ్రికి చెబుతాడు. స్తంభమును హిరణ్య కశిపుడు భేదించాగానే "నరసింహ అవతారుడై" శ్రీ హరి హిరణ్య కశిపుని పట్టి ఎత్తి, గుమ్మం పై కూర్చొని, తొడమీద వేసుకుని, సంధ్యా సమయంలో తన వాడి గోళ్ళను ఆయుధంగా చేసి ఆ దనుజుని చీల్చి చెండాడుతాడు. ఆనాటి భక్తర ప్రహ్లాద చిత్రం ఇప్పటికీ చూడ దగ్గ కళా ఖండం. అందులోని అంతిమ ఘట్టం ఈ విడియో లో చూడ గలరు.



అయితే ఒకప్పుడు పండగలకు చిన్న చిన్న ఊర్లలో పౌరాణిక నాటకాలు బాగా వేసే వారు. ఒకోసారి కొన్ని సన్నివేశాలు ఎప్పటికీ గుర్తుంది పోతాయి.  మా ఊర్లో నా చిన్నప్పుడు భక్త ప్రహ్లాద నాటకం వేసారు. వాళ్ళు నెల రోజుల నుంచి రిహార్సల్సు చేస్తున్నారు. అయితే ఆఖరి సీన్ లో పాత్ర దారులు కొంచెం గాభారాతో ఉన్నారు. అందులో రిహార్సలులో అనుకున్నవి మరచి పోయి నరసింహ పాత్ర దారి ముందుగా అనుకున్న స్తంభం కాకుండా మరో స్తంభం లో దాగున్నాడు. అది పాపం ప్రహ్లాద పాత్ర దారికి మాత్రమే తెలుసు. హిరణ్య కశిపుడికి తెలియదు. అయితే "ఈ స్తంభము లో చూపగలవా హరిని " అని హిరణ్య కశిపుడు ముందు అనుకున్న స్తంభం చూపించి ప్రహ్లాడుడ్ని అడిగాడు. పాపం! ప్రహ్లాదుడు అంతకు ముందే "ఇందు గలడందు లేడను సందేహం వలదు" అని పద్యం చెప్పేశాడు. తీరా ఇప్పుడు స్తంభం మారిపోయింది. కాని హిరణ్య కశిపుడికి తెలియదే. అయితే వెంటనే ప్లేటు మార్చేశాడు. "లేదు తండ్రీ! ఆ స్తంభము లో కాదు ఈ స్తంభం లో చూపగలను హరిని" అని నరసింహ పాత్ర దారి దాగున్న స్తంభం చూపాడు. హాలులో అందరూ ఈలలు చప్పట్లు. మొత్తానికి ప్రహ్లాదుని సమయస్ఫూర్తి వలన నాటకం రక్తి కట్టింది.

5 కామెంట్‌లు:

  1. Namaste Suryanarayana garu,

    Nice article and great joke at the end of the vyasam. Priest Satyam garu also mentioned the same about Narasimha jayanthi and the door for narasimha sannidhi has been opened. Thank you.
    Ravi Mulukutla

    రిప్లయితొలగించండి
  2. Sri Suryanarayana garu,
    If you can ensure such articles depicting the Indian Puranas etc are read and explained (since most of the Indian children cant read Telugu script in US) I hope your mission will be 100% successful. My whole hearted blessings to you.
    Sarma Mulukutla. India (father of Ravi)

    రిప్లయితొలగించండి
  3. Dear Sri Subrahmania garu. Thank you for your encouraging words. I am also trying to put these articles in English through my other blog "Devotion" intended to help kids of Indian origin residing in India. Initially, I have put some shlokas with their meaning. I will be doing the stories from Hindu mythology also. It is also important that these kids spend some time reading these stories. Parents living abroad have a major role in directing the kids to such web sites to know more about our culture and heritage. I sincerely appreciate your feelings.

    రిప్లయితొలగించండి

Blog Junctions