అన్నమయ్య సంకీర్తనలలో ఒక ప్రత్యేకత వుంది. ఒక "థీం" తీసుకుని దానిని సంకీర్తనగా మలచి ఆనందిస్తాడు, అందరినీ ఆనందింప జేస్తాడు. విష్ణు భక్తుడైన అన్నమయ్య ఆ స్వామికి చేసే పదహారు ఉపచారాలను చక్కగా కీర్తన రూపంలో అందించాడు. ఈ ఉపచారాలను మనం ప్రతి పూజలో ఆయా దేవుళ్ళను లేదా దేవతలను పూజించే సమయాన "సమర్పయామి" అని చదువుతాం.
జాడతోన నిచ్చలును సమర్పయామి
అలరు విశ్వాత్మకును ఆవాహనమిదే సర్వ
నిలయునకు ఆసనము నెమ్మినిదే
అల గంగా జనకునకు అర్ఘ్య, పాద్య, ఆచమనాలు
జలధి శాయికిని మజ్జనమిదే ||షోడశ||
వర పీతాంబరునకు వస్త్రాలంకారామిదే
సరి శ్రీమంతునకు భూషణములివే
ధరణీ ధరునకు గంధ, పుష్ప, ధూపములు
తిరమిదే కోటి సూర్య తేజునకు దీపము ||షోడశ||
అమృత మథనునకు అదివో నైవేద్యము
గమి చంద్ర నేత్రునకు కప్పుర విడెము
అమరిన శ్రీ వెంకటాద్రి మీది దేవునకు
తమితో ప్రదక్షిణాలు దండములు ఇవిగో ||షోడశ||
షోడశోపచారములు:
1. ఆవాహనం, 2. ఆసనం, 3. అర్ఘ్యం, 4. పాద్యం, 5. ఆచమనం, 6. మజ్జనం (స్నానం), 7. వస్త్రం, 8. భూషణం, 9. గంధం, 10. పుష్పం, 11. ధూపం, 12. దీపం, 13. నైవేద్యం, 14. కర్పూరం (హారతి), 15. ప్రదక్షిణం, 16. దండం (నమస్కారం).
వీటినుపయోగించే విధానం పూజలో ఇలా ప్రస్తుతిస్తాము:
ఆవాహయామి; ఆసనం సమర్పయామి; అర్ఘ్యం సమర్పయామి;పాద్యం సమర్పయామి; ఆచమనం సమర్పయామి; స్నానం సమర్పయామి; వస్త్రం సమర్పయామి; భూషణం సమర్పయామి; గంధం సమర్పయామి; పుష్పం సమర్పయామి; ధూపం సమర్పయామి; దీపం దర్శయామి; నైవేద్యం సమర్పయామి; నీరాజనం సమర్పయామి; ప్రదక్షిణం సమర్పయామి; దండం సమర్పయామి. అయితే యజ్ఞోప వీతం, మధు పర్కం ఒక విధమైన భూషణములే అనుకుంటాను.

వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి
హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ
chaa vivaramgaa chakkagaa vraashaaru
రిప్లయితొలగించండిjaishriraam
ధన్యవాదాలు దుర్గేశ్వర గారు.
రిప్లయితొలగించండిthese are all that we do in "satyanarana vratham"
రిప్లయితొలగించండిvery good....
Thanks Kishenji
రిప్లయితొలగించండిannamaa charya keertana anuvadam chala bagunnadi
రిప్లయితొలగించండిmadhu parkam anaga tene perugu kalipina oka sheetala paneeeyamu meeru marinni keertanalu anuvadinchalani srivarini prardhistunnanu
chakrapani
చక్రపాణి గారికి, నమస్కారం. మీ స్పందనకు ధన్యవాదాలు. క్రొత్త విషయాలు తెలిపినందుకు కృతజ్ఞతలు. మీ సహచర్యంతో, సహకారంతో మరిన్ని కీర్తనలు పొందుపరచగలనని ఆశిస్తునాను. అంతా భగవదేఛ్చ. ఓం నమో వేంకటేశాయ నమః.
రిప్లయితొలగించండి