8, మే 2011, ఆదివారం

ప్రవాస భారతీయ సంతతి పాల్గొన్న రామానుజ జయంతి ఉత్సవం

శ్రీ రామానుజాచార్య
కేరీ, నార్త్ కరోలిన, అమెరికా: స్థానిక శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో ప్రవాస భారతీయ సంతతియైన పలువురు చిన్నారులు నిన్న శనివారం (మే 7, 2011) శ్రీ రామానుజాచార్య జయంతి ఉత్సవంలో పాల్గొన్నారు. శ్రీ రామానుజులు హైందవ భక్తి సంప్రదాయాలలో విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించిన మహా మహులు. ఇతనికి యతిరాజు, ఎమ్పెరుమన్నార్ మరియు లక్ష్మణ ముని అనికూడా పేర్లు ఉన్నాయి. శ్రీ రామానుజాచార్య జయంతిని భారత దేశంలోని శ్రీరంగం లోను, వివిధ వైష్ణవ మఠాలలోను, పీఠాలలోను ప్రతి ఏటా ఘనంగా జరుపుతారు.
        కేరీ, నార్త్ కరోలినా లో గల శ్రీ వెంకటేశ్వర ఆలయం (S.V.Temple of North Carolina, Cary, NC) నిర్వహించే "విష్ణు స్తుతి" ప్రాజెక్టు లో ఆరు సంవత్సరాల నుండి పదునాలుగు సంవత్సరాల వయసు గల పలువురు బాల బాలికలు  శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము ను నేర్చుకుంటున్నారు.  వీరికి వేద పండితులైన ఆలయ అర్చకులు ప్రతి శనివారం ఒక గంట పాటు విష్ణు స్తుతి లోని శ్లోకాలను నేర్పుతున్నారు.   
        నిన్న జరిగిన రామానుజ ఆచార్య జయంతి సందర్భంగా శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి గారు తమ ప్రత్యేక అభినందన సందేశాన్ని, ఆశీస్సులను తెలియజేసారు. సాయంత్రం జరిగిన పూజ, అర్చన కార్యక్రమలో 'విష్ణు స్తుతి' విద్యార్ధులు, విద్యార్ధినులు ముందుగా గురు పరంపరకు సంబంధించిన "శ్రీశైలేంద్ర దయాపాత్రం.." శ్లోకాలను, తదుపరి విష్ణు సహస్ర నామం యొక్క పూర్వ పీఠిక యందలి పది శ్లోకాలను పారాయణం చేసారు. ఆ వివరాలను, విశేషాలను క్రింది వీడియోలో చూడవచ్చును. క్రింది లింకును క్లిక్ చేయండి.

అస్మద్ గురుభోన్నమః


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Blog Junctions