4, మే 2011, బుధవారం

పద కవితలతో ఆడుకున్నావయ్యా, అన్నమయ్యా

ఒక పదాన్ని తీసుకుని దానిని సందర్భోచితంగా ఉపయోగిస్తూ అద్భుతమైన పద రచన చేసాడు అన్నమయ్య. సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం కూడా తెలుగు భాష ఎంత సుందరంగా ఉందొ అని అన్నమయ్య కీర్తనలు వింటే తెలుస్తుంది. సహజమైన, సరళమైన శైలిలో వేంకటేశ్వరుని పై ఆయన అల్లిన ఈ కృతిలో "ఏడ" (ఎక్కడ) అనే పదాన్ని తీసుకుని ఎంత చక్కగా రాసాడో చూడండి. ప్రతి వాక్యం లోను ఆ పురుషోత్తముని గుణ గుణాలను ప్రస్తుతిస్తూ వెనువెంటనే ఇటువంటి గుణాలు గల వానికి అదీ-ఇదీ, అక్కడా-ఇక్కడా, లోపల-వెలుపల తో పని ఏమిటి అని ఎన్నో విశేషణాలతో రచించిన కృతి ఇది.
  
విశ్వ ప్రకాశునకు వెలి ఏడ? లోనేడ?
శాశ్వతున కూహింప జన్మమిక నేడ?

సర్వ పరిపూర్ణునకు సంచారమిక నేడ?
నిర్వాణమూర్తికిని నిలయమిక నేడ?
ఉర్వీధరునకు కాలూద నొక చోటేడ?
పార్వతీ స్తుత్యునకు భావమిక నేడ?

నానా ప్రక్రాశునకు నడుమేడ? మొదలేడ?
ఆనన సహసృనకు అవ్వలివలేడ?
మౌని హృదయస్థునకు మాటేడ? పలుకేడ? 
జ్ఞాన స్వరూపునకు కాన విననేడ?

పరమ యోగీంద్రునకు పరులేడ? తానేడ?
దురిత దూరునకు సంస్తుతి నిందలేడ?
తిరు వేంకటాధీశునకు దివ్య విగ్రహమేడ?
హరికి నారాయణున కవుగాములేడ?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Blog Junctions