నిన్న మా మిత్రుని యింటిలో (రాలీ, నార్త్ కరోలినా) షిరిడి సాయి భజనలు చేసాము. భజన సమయంలో శ్రీ సత్యసాయిని తలచుకున్నాము. ఆయన పరిస్థితి భక్తులన్దరినీ కలవర పెడుతోంది. నాకెందుకో అనిపించి మహా మృత్యుంజయ మంత్రాన్ని తొమ్మిది సార్లు అందరితో కలసి పారాయణం చేసాం. ఈ రోజు ఉదయం లేవగానే నా బ్లాగులో కి లాగిన్ అయి శ్రీ సత్యసాయి బాబా గురించి ఏదైనా వ్రాయాలనిపించింది. నా ఇష్ట గాయకుడు శ్రీ ఘంటసాల శ్రీ సత్య సాయి బాబా గారి పై పాడిన పాట గుర్తుకొచ్చింది. ఆ పాటను యూ ట్యూబు లో వెదికి, నా బ్లాగులో పెట్టి ఆ పాటను వింటూ దాని లిరిక్స్ వ్రాసాను. అయితే పాట ఆఖరులో "ఓం శాంతి శాంతి శాంతి హి" అని వస్తుంది. ఎందుకో అనిపించి దానిని పోస్టు చేసే ముందు ఎందుకో ఒకసారి ఈనాడు ఇంటర్ నెట్ ఎడిషను చూద్దామని ఓపెన్ చేసేటప్పటికి నా కళ్ళు అశ్రు పూరితాలయ్యాయి. ఇప్పటికీ నమ్మ లేకుండా వున్నాను.
బోలో శ్రీ సత్య శాయి బాబా జి కి జై!
బోలో శ్రీ సత్య శాయి బాబా జి కి జై!
ప. నమో సత్య శాయి బాబా.. నమో.. నమో... సత్య శాయి
నమో సత్య శాయి బాబా నమో శాయి (2)
నమో విశ్వ తేజా జ్యోతి స్వరూపా (2)
చ. అరుణ కాంతులలోన అగుపించే నీ మోము
ఆ మోము కాంచిన అంతరంగము పొంగే || అరుణ ||
ఈ నాటి ఈ సుఖము ఏనాడు పొందము || ఈ నాటి || ఏ నోము నోచామో ఇపుడు కనుగొన్నాము || ఏ నోము ||
నమో సత్య శాయి బాబా నమో సాయి
నమో విశ్వ తేజా జ్యోతి స్వరూపా
నమో సత్య శాయి
చ. విరులూ తరులూ వికసించినవి
మనసూ తనువూ పులకించినవి || విరులూ ||
వరుసగ నిలిచి ఒడలను మరచి || వరుసగ ||తరియించ కోరేము నీ చెంత నిలచి || తరియించ ||
నమో సత్య శాయి బాబా నమో సాయి
నమో విశ్వ తేజా జ్యోతి స్వరూపా
నమో సత్య శాయి బాబా నమో సాయి
నమో సత్య శాయి బాబా నమో సాయి
నమో సత్య శాయి బాబా నమో సాయి
బాబా..
ఓం శాంతి శాంతి శాంతి హీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి