1, ఏప్రిల్ 2026, బుధవారం

పద్యం - మద్యం

పద్యం - మద్యం

నా చిన్ననాటి ప్రియమిత్రుడు డాక్టర్ కోమలరావు చెప్పిన చక్కని పద్యం -


ఆ.వె.

పద్యమద్యములకు మధ్య నంతర మేమి ? 

చెప్పుడీయన కవి చెప్పె నిట్లు/

ఒకటి యుండు  సీసమందు వేరొకటిముడు /

చిత్రముగ మెరసెడి సీసయందు . (డా. కోమలరావు, శ్రీకాకుళం)


నాకు పద్యం రాదు. గద్యం నా యత్నం.

నా మాటలలో పద్యానికి, మద్యానికి తేడా-


పద్యమును ప్రేమించును మక్కువగనక

మద్యమును సేవించును కిక్కురుమనక


యతిప్రాసా ఛందోబద్ధం పద్యం 

మతిపోయి ఇంట్లోయుద్ధం మద్యం


ఆద్యంతం హృద్యం పద్యం 

అది మనోక్షేత్రంలో రసభావ సేద్యం 

మనసుకవి హృదయనైవేద్యం


ఆదిలోనె చోద్యం మద్యం 

అనంతరం అవసరం వైద్యం 

ఎంతైనా అంతం తథ్యం


ఇదే పద్యమద్యాలకు వైవిధ్యం


- డా. సూర్యనారాయణ వులిమిరి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Blog Junctions