12, నవంబర్ 2010, శుక్రవారం

అక్షర మాల తో శివుని స్తోత్రము - 'సాంబ సదాశివ స్తోత్రం'

కార్తీక మాసం సందర్భంగా శివుని అక్షర మాల లో ప్రతి ఒక్క అక్షరం తో ప్రారంభం అయ్యేలా వర్ణించే అక్షర మాలాస్తవం  లేదా 'సాంబ సదాశివ స్తోత్రం' సేకరించి ఇక్కడ పొందు పరచాను. ఇందులో ఋ, ఋ ల తరువాత వచ్చే అలు, అలూ లకు ప్రస్తుతం ఉన్న లిపిలో అక్షరాలు లేవు. బహుశా ఇవి వాడుకలో లేక పోవడం వలనేమో. వాటి స్థానే ళు, ళూ లు ఉపయోగించ వలసి వచ్చింది. ఈ శివ అక్షర మాలా స్తవం ఎవరు వ్రాసారో తెలియదు. కాని మన అక్షర మాలలోని ఇంచు మించు ప్రతి ఒక్క అక్షరం తో ప్రారంభం అయ్యేలా ఈ స్తోత్రాన్ని రచించడం అపూర్వమైన విషయం.



శ్రీ సాంబ సదాశివ అక్షరమాలాస్తవః

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ ||
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ ||

ద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ         ||సాంబ||
నందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ                   ||సాంబ||
ఇందు కళాధర ఇంద్రాదిప్రియ సుందరరూప సురేశ శివ               ||సాంబ||
శ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత కీర్తి శివ                    ||సాంబ||
రగాదిప్రియ ఉరగవిభూషణ నరకవినాశ నటేశ శివ                   ||సాంబ||
ర్జిత దానవనాశ పరాత్పర ఆర్జిత పాపవినాశ శివ                    ||సాంబ||
గ్వేదశ్రుతి మౌళి విభూషణ రవి చంద్రాగ్ని త్రినేత్ర శివ              ||సాంబ||
పనామాది ప్రపంచ విలక్షణ తాపనివారణ తత్వ శివ              ||సాంబ||
ళుల్లిస్వరూప సహస్ర కరోత్తమ వాగీశ్వర వరదేశ శివ                   ||సాంబ||
ళూతాధీశ్వర రూపప్రియహర వేదాంతప్రియ వేద్య శివ                 ||సాంబ||
కానేక స్వరూప సదాశివ భోగాదిప్రియ పూర్ణ శివ                     ||సాంబ||
శ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన సచ్చిదానంద సురేశ శివ               ||సాంబ||
ఓంకారప్రియ ఉరగవిభూషణ హ్రీంకారప్రియ ఈశ శివ                  ||సాంబ||
రసలాలిత అంతకనాశన గౌరిసమేత గిరీశ శివ                       ||సాంబ||
అంబరవాస చిదంబర నాయక తుంబురు నారద సేవ్య శివ            ||సాంబ||
హారప్రియ అష్ట దిగీశ్వర యోగి హృదిప్రియవాస శివ                 ||సాంబ||

మలాపూజిత కైలాసప్రియ కరుణాసాగర కాశి శివ                    ||సాంబ||
డ్గశూల మృడ టంక ధనుర్ధర విక్రమరూప విశ్వేశ శివ               ||సాంబ||
గంగా గిరిసుత వల్లభ శంకర గణహిత సర్వజనేశ శివ                  ||సాంబ||
ఘాతక భంజన పాతకనాశన దీనజనప్రియ దీప్తి శివ                  ||సాంబ||
జ్ఞాన్త స్వరూపానంద జనాశ్రయ వేదస్వరూప వేద్య శివ                ||సాంబ||

చండవినాశన సకలజనప్రియ మండలాధీశ మహేశ శివ               ||సాంబ||
త్రకిరీట సుకుండల శోభిత పుత్రప్రియ భువనేశ శివ                  ||సాంబ||
న్మజరా మృత్యాది వినాశన కల్మషరహిత కాశి శివ                  ||సాంబ||
ఝంకారప్రియ భృంగిరిటప్రియ ఒంకారేశ్వర విశ్వేశ శివ                ||సాంబ||
జ్ఞానాజ్ఞాన వినాశన నిర్మల దీనజనప్రియ దీప్తి శివ                     ||సాంబ||

టంకస్వరూప సహస్ర కరోత్తమ వాగీశ్వర వరదేశ శివ                  ||సాంబ||
క్కాద్యాయుధ సేవిత సురగణ లావణ్యామృత లసిత శివ            ||సాంబ||
డంభవినాశన డిండిమభూషణ అంబరవాస చిదేక శివ                 ||సాంబ||
ఢంఢండమరుక ధరణీనిశ్చల ఢుంఢివినాయక సేవ్య శివ              ||సాంబ||
నానామణిగణ భూషణనిర్గుణ నతజనపూత సనాథ శివ               ||సాంబ||

త్వమస్యాది వాక్యార్థ స్వరూప నిత్యస్వరూప నిజేశ శివ              ||సాంబ||
స్థావరజంగమ భువనవిలక్షణ తాపనివారణ తత్వ శివ                ||సాంబ||
దంతివినాశన దళితమనోభవ చందన లేపిత చరణ శివ                ||సాంబ||
రణీధరశుభ ధవళవిభాసిత ధనదాదిప్రియ దాన శివ                ||సాంబ||
ళినవిలోచన నటనమనోహర అళికులభూషణ అమృత శివ         ||సాంబ||

పార్వతినాయక పన్నగభూషణ పరమానంద పరేశ శివ               ||సాంబ||
ఫాలవిలోచన భానుకోటిప్రభ హాలాహలధర అమృత శివ              ||సాంబ||
బంధవిమోచన బృహతీపావన స్కందాదిప్రియ కనక శివ              ||సాంబ||
స్మవిలేపన భవభయమోచన విస్మయరూప విశ్వేశ శివ             ||సాంబ||
న్మథనాశన మధురానాయక మందరపర్వతవాస శివ              ||సాంబ||

తిజన హృదయాధినివాస విధివిష్ణ్వాది సురేశ శివ                  ||సాంబ||
రామేశ్వరప్రియ రమణముఖాంబుజ సోమేశ్వర సుకృతేశ శివ        ||సాంబ||
లంకాధీశ్వర సురగణ సేవిత లావణ్యామృత లసిత శివ                ||సాంబ||
రదాభయకర వాసుకిభూషణ వనమాలాది విభూష శివ             ||సాంబ||
శాంతి స్వరూప అతిప్రియసుందర వాగీశ్వర వరదేశ శివ               ||సాంబ||
ణ్ముఖజనక సురేంద్ర మునిప్రియ షాడ్గుణ్యాది సమేత శివ           ||సాంబ||
సంసారార్ణవ నాశన శాశ్వత సాధుజన ప్రియవాస శివ                 ||సాంబ||
రపురుషోత్తమ అద్వైతామృత మురరిపు సేవ్య మృదేశ శివ        ||సాంబ||
లాళిత భక్తజనేశ నిజేశ్వర కాళినటేశ్వర కామ శివ                      ||సాంబ||
క్షరరూపాభి ప్రియాన్విత సుందర సాక్షాత్ స్వామిన్నంబా సమేత శివ||సాంబ||

5 కామెంట్‌లు:

  1. చిన్నప్పుడు సాయంత్రం వేళ మజ్జిగ చిలుకుతూ మా అమ్మ ఈ పాట పాడేది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తరువాత గుర్తు తెచ్చారు :).

    రిప్లయితొలగించండి
  2. చాల సంతోషం రిషి గారు. నాకు కూడా అదే స్పందన. ఎందుకంటే మా తాత గారు నా చిన్నప్పుడు ప్రొద్దున్నే ఈ స్తోత్రం పాడుతుండేవారు. ఆయన ఇపుడు లేరు కాని. ఆ జ్ఞాపకాలు చాల మధురమైనవి.

    రిప్లయితొలగించండి
  3. ఈ పాట విన్నాను గానీ ఇలా ఇందులో అక్షరమాల దాగుందని గమనించనేలేదు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. నా దగ్గర ఉంది కానీ కొంచెం మార్పుతో ఉంది

    రిప్లయితొలగించండి
  5. చాలా బాగుంది..ధన్యవాదములు...సువర్ణ మాలా స్తోత్రం అనే పేరుతో ఉంది నా దగ్గర వేరేగా..

    రిప్లయితొలగించండి

Blog Junctions