20, నవంబర్ 2010, శనివారం

వినాయకుని ప్రార్థన లో విష్ణువేంటి చెప్మా!


మనం ఏ దేవుణ్ణి పూజించినా, ఏ కార్య క్రమం ప్రారంభించినా ముందుగా గణేశ ప్రార్థన చేస్తాం. సర్వ సాధారణం గా "శుక్లాంబరధరం విష్ణుం" శ్లోకాన్ని చాల మంది చదువుతారు. ఇది అందరికీ తెలిసిన శ్లోకం.

శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్ భుజం 
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే 

అయితే వినాయకుడిని ప్రార్థించే శ్లోకం లో విష్ణుం అని అంటామేమిటి? అని చాల మంది అనుకోవచ్చు. కాని ఇక్కడ 'విష్ణుం' అంటే విష్ణుమూర్తి కాదు. విష్ణుం  అంటే సర్వం వ్యాపించి యున్నవాడు అని అర్థం. అలాగే కొంతమంది శుక్లాంబరధరం ను పిల్లలకు నేర్పేటప్పుడు 'శుక్లాం ..బరధరం' అని చెబుతుంటారు. ఇది సరి కాదు. 'బరధరం' అన్న మాటకి అర్థం లేదు. ఈ శ్లోకం యొక్క అర్థాన్ని దిగువన వివరిస్తున్నాను.

శుక్ల = తెల్లని; అంబర = వస్త్రం (ఆకాశం అని ఇంకొక అర్థం); ధరం = ధరించిన వాడు;  విష్ణుం = సర్వాంతర్యామి; శశి* = చంద్రుడు.  వర్ణం = రంగు; చతుర్ = నాలుగు; భుజం = భుజాలు గల; ప్రసన్న = చిరునవ్వు తో కూడిన; వదనం = ముఖము; ధ్యాయేత్ = ధ్యానింతును; సర్వ = అన్ని, సమస్త; విఘ్న = అడ్డంకులు; ఉపశాన్తయే = తొలగించు. 

*శశి అంటే అసలు అర్థం కుందేలు రూపం గల అని. మనం చందమామను, పౌర్ణమి దగ్గరలో చూస్తే కుందేలు ఆకారం కనిపిస్తుంది. ప్రముఖ పిల్లల కథల పుస్తకమైన 'చందమామ' లో, చందమామ బొమ్మ మధ్యలో కుందేలు బొమ్మ వేసి ఉండడం మీరు గమనించే ఉంటారు.

తాత్పర్యము:

తెల్లని వస్త్రమును ధరించి, చంద్రుని వలె తెల్లని రంగు తో వెలుగుతూ, సర్వాంతర్యామి యై, నాలుగు భుజములు కలిగిన వానిని (గణేషుని), అన్ని అడ్డంకులు తొలగించమని ప్రార్థించెదను.   

6 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. నమస్కారం గురువు గారు,నేను మీ అభిమానిని.నేను ఆంద్రభూమి లో ప్రచురితమయిన రూపాయి చెప్పిన బేతాళ కథలు చదివాను.అలా మీ గురించి తెలుసుకున్నాను.ప్రస్తుతం మీ బ్లాగ్ జోకాభిరామయణం గురించి చూసాను,బ్లాగ్ కి ఎంటర్ అవటానికి ఇన్విటేషన్ అడుగుతుంది.మీరు నన్ను invite చేయగలరని ఆశిస్తున్నాను.నా పేరు శివ ప్రసాద్,నా మెయిల్ ఐడి.cherry116122@gmail.com
      ధన్యవాదములు గురువు గారు.

      తొలగించండి
    2. శివప్రసాద్ గారికి నమస్కారం. నా బ్లాగు ఓపెన్‌ గానే వుందండి. నాకు తెలిసి అలా ఇన్విటేషన్‌ ఏమీ లేదు. ఎవరైనా చూడవచ్చును.

      తొలగించండి
  2. హ్మ్.. నిజమే కదా :) మంచిగా అర్థం చెప్పారు. ధన్యవాదాలు.

    @సత్యప్రసాద్ గారు,
    బాబోయ్.. భలేరాశారు. ఇక్కడ పంచినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. చాల బాగ అర్థం చెపారు . ఇలాంటి మరికొన్ని పద్యాలకు అర్థం చెపుతే బాగుంటుంది .

    రిప్లయితొలగించండి

Blog Junctions