భారత మాత 1947 ఆగస్టు పదిహేను అర్ధరాత్రి దాస్య శృంఖలాల నుండి విముక్తురాలు అయ్యింది. ప్రజలంతా సంబర పడ్డారు. అయితే స్వరాజ్యం రావడంతో మన కర్తవ్యం పూర్తి కాలేదు, అసలు ప్రగతి అంతా ముందుంది అని, "స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి సంబర పడగానే సరిపోదోయి, సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి" అని అలనాడు తన పెన్నుతో మన వెన్ను తట్టి హెచ్చరించారు మహాకవి శ్రీశ్రీ.
తరువాత స్వాతంత్ర్యం వచ్చిన అయిదు పదులకు దేశ రాజకీయ వాతావరణం లో చాల మార్పులు వచ్చాయి. కాని సగటు మనిషి జీవితంలో మార్పు రాలేదు. ఇంతలో నక్సలిజం రాజుకుంది. ఆ నేపథ్యంలో విడుదలయిన చిత్రం "సిందూరం". 'కృష్ణ వంశీ' దర్శకత్వంలో విడుదలయిన ఈ చిత్రం రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డ్ ను, మరియు ఫిలిం ఫేర్ అవార్డును గెలుచుకుంది. ఈచిత్రంలో ఒక మరపురాని గీతం వ్రాసినది శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. వారి కలం, కత్తి కన్నా పదునైనదని నిరూపించిన గీతం ఇది. నిజానికి చిత్ర నిర్మాణం పూర్తయి, ప్రీవ్యూ చూసి బయటకు వచ్చిన తరువాత కలిగిన స్పందన తో అప్పటికప్పుడు శాస్త్రి గారి కలం-గళం నుండి పెల్లుబికిన కవితావేశం ఈ గీతం అని కృష్ణవంశీ గారి మాటలలో తెలిసింది.
ప్రస్తుతం మనకు స్వాతంత్ర్యం వచ్చి ఆరు పదులు పైబడింది.అయినా సగటు రాజకీయ వాతావరణంలో మార్పు ఏ మాత్రంలేదు. కాకపోతే, మార్పుకోసం దశాబ్దానికొక కొత్త అలజడి, ఒక కొత్త ఉన్మాదం, వెరసి ఇదీ మన ప్రగతి గతి. వాస్తవానికొస్తే, ఈ పాట వింటుంటే ఏదో తెలియని బాధ కలుగుతుంది. మనసులో ఆశావాదం నిండి వున్నా ఒక్కోసారి నైరాశ్యం ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుంటుంది. సిరివెన్నెల గారు తన పాటలో పలుకులో ఆ ఆవేదనను సాధారణ పదాలతో చక్కగా, స్పష్టంగా వ్యక్తం చేసారు. దిగువన కృష్ణ వంశీ గారి ముందు మాట, సిరివెన్నెల గారితో ఇంటర్ వ్యూ, ఈ పాట సాహిత్యం పొందు పరస్తున్నాను. పాట పాడినది మరెవరో కాదు, బహుగళ గానగంధర్వుడు బాలు.
వీడియోలో మొత్తం పాట దొరకలేదు. పూర్తి పాటను (మూడు చరణాలు) క్రింది ఆడియో లింకులో వినవచ్చును.
ప. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా! స్వర్ణోత్సవాలు చేద్దామా!
ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా! దానికి సలాము చేద్దామా!
నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా! ఓ! పవిత్ర భారతమా!
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా
నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్చను చూద్దామా! దాన్నేస్వరాజ్యమందామా!
చ. కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడలేని తెగువను చూపి తగువుకి లేస్తారే, జనాలు తలలర్పిస్తారే
సమూహక్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకు పోతూ
మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే, తెలిసి భుజం కలిపి రారే
మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే, తెలిసి భుజం కలిపి రారే
అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి? పోరి, ఏమిటి సాధించాలి?
ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సిందూరం
జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా! ఓ అనాథ భారతమా!
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా! స్వర్ణోత్సవాలు చేద్దామా!
ఆత్మవినాశపు అరాజకాన్ని స్వరాజ్యమందామా! దానికి సలాము చేద్దామా!
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా! స్వర్ణోత్సవాలు చేద్దామా!
ఆత్మవినాశపు అరాజకాన్ని స్వరాజ్యమందామా! దానికి సలాము చేద్దామా!
చ. అన్యాయాన్ని సహించని శౌర్యం, దౌర్జన్యాన్ని దహించే ధైర్యం
కారడవులలో క్రూర మృగంలా దాక్కుని ఉండాలా! వెలుగుని తప్పుకు తిరగాలా!
శత్రువుతో పోరాడే సైన్యం, శాంతిని కాపాడే కర్తవ్యం
స్వజాతి వీరులనణచే విధిలో సవాలు చెయ్యాలా! అన్నల చేతిలో చావాలా!
తనలో ధైర్యం అడవికి ఇచ్చి, తన ధర్మం చట్టానికి ఇచ్చి ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే
నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం, ఈ సంధ్యా సిందూరంవేకువ వైపా, చీకటి లోకా ఎటు నడిపేవమ్మా! గతి తోచని భారతమా!
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా! స్వర్ణోత్సవాలు చేద్దామా!
యుద్ధ నినాదపు అరాజకాన్ని స్వరాజ్యమందామా! దాన్ని సవాలు చేద్దామా!
చ. తన తలరాతను తనే రాయగల అవకాశాన్నే వదులుకొని
తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకుని
ప్రజాస్వామ్యమని తలిచే జాతిని ప్రశ్నించడమే మానుకొని
కళ్ళు వున్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం
ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుందట అధికారం
కృష్ణుడు లేని కురుక్షేత్రముగ సాగే ఈ ఘోరం చితి మంటల సిందూరం
చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా! ఓ విషాద భారతమా
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మవినాశపు అరాజకాన్ని స్వరాజ్యమందామా! దానికి సలాము చేద్దామా!
శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ రక్తపు సిందూరం
నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా! ఓ! పవిత్ర భారతమా!
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా
నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్చను చూద్దామా! దాన్నేస్వరాజ్యమందామా!
ఎప్పటికైనా మార్పు వస్తుందని ఆశిద్దాం!
అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
*యూ ట్యూబ్ లో దొరికిన వీడియో (divyakshar.blgospot) శ్రీ లోకేష్ గారిదని గ్రహించాను. వారి "మధుర గీతాలు" బ్లాగులో మరిన్ని పాటలున్నాయి. వారు నాకు తెలియక పోయినా, వారి వీడియో క్లిప్ వాడుకున్నందుకు క్షమించగలరు.
My dear Babu - This is very well designed and well timed message. Keep it up - Mamam
రిప్లయితొలగించండిThanks Mama
రిప్లయితొలగించండిస్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిరాజి గారికి, ధన్యవాదములు. మీకు కూడ స్వాతంత్ర్యదిన శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిఈ పాటని పెసిమిజపు భావ ప్రకటనగా కొందరు మేధావులు విమర్శించారు.
రిప్లయితొలగించండిఅయినా ఈ కాలం లో జాతీయ గేయం ( గీతం కాదు) గా పడు కోవాల్సిన రచన.
ప్రతీ పౌరుడూ ప్రశ్నించు కోవాల్సిన సమయం.
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..!!
ఆత్రేయ గారికి ధన్యవాదాలు. మీతో అక్షరాలా ఏకీభవిస్తాను. ఇది మనని మనం తప్పనిసరిగ ప్రశ్నించుకోవలసిన సమయం. ఆత్మవిశ్లేషణ ప్రతివారికీ వుండాలి. మనం ఏం చేస్తున్నాం? ఎక్కడికెళుతున్నాం? అని.
రిప్లయితొలగించండిచాలా చక్కని పాట.మీ ఆవేదన..నిజం.ప్రతి పౌరుడు..ఆత్మా విమర్శ చేసుకుని..భాద్యత గల పౌరునుగా నడుచు కోవాలని..కోరుకుందాం. సిరివెన్నెల గారు..స్పందించి వ్రాసిన పాటల్లో.. ఇది ఒక ఆణిముత్యం. చాలా బాగా చెప్పారు.బాగుంది.ధన్యవాదములు
రిప్లయితొలగించండిఈ మీ పోస్ట్ చూసిన తర్వాత ఎప్పుడో..నేను వ్రాసిన కవిత అందరితో పంచుకోవాలనిపించింది. దయచేసి ఈ లింక్లో..చూడగలరు
రిప్లయితొలగించండిhttp://vanajavanamali.blogspot.com/2010/12/kavithwa-vanamlovanaja_7512.html
వనజ వనమాలి గారు ధన్యవాదాలు. మీ కవిత బాగుంది. మీరు సిరివెన్నెల గారు తీసుకున్న శీర్షిక చాల దగ్గరగా వుంది. మంచి కవిత.
రిప్లయితొలగించండిసిరివెన్నెల గారి గురించి ఎంత చెప్పినా తక్కువే .అద్భుతమయిన పాట.అర్థవంతమయిన పాట .ఇలాంటిదే
రిప్లయితొలగించండిగాయం లో ఇంకో పాట సురాజ్యమవలేని స్వరాజ్య మెందులకు .......... ఆయనే వ్రాసిన ఒక గేయం దీనికి మాతృక .త్రిశంఖు స్వర్గం లో త్రివర్ణ పతాకం ........... .
అవునండీ. సిరివెన్నెల గారు అన్ని రసాలు చిలికించగల మహానుభావుడు.
తొలగించండి