7, డిసెంబర్ 2010, మంగళవారం

మహదానందం కలిగించే మహదేవన్ బాణీలు మచ్చుకు కొన్ని

డిశంబరు 6, మామ మహదేవన్ పుట్టినరోజు. ఈ సంగీత సార్వభౌముని మంచి మంచి బాణీలు వినాలంటే అందరికీ మహదానందం. అంత చక్కగా ఉంటాయి. ఈ రోజు టపాలో రావు గారు (శిరాకదంబం) చక్కని పాటల రూపకాన్ని పోస్ట్ చేసారు. అవి వింటుంటే గతంలోకి తొంగిచూసి మళ్ళా బేక్ టు ది ఫ్యూచర్ కి వచ్చినట్లయింది.  శ్రీ రావుగారు సమర్పించిన మామ బాణీల శృంఖల రూపకంలోని చాల మట్టుకు పాటల పల్లవులను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. అందులో నాకు తెలియనివి ఐదు నుండి పదిశాతం.

మహదేవన్ గారి గురించి చెప్పాలంటే, కేరళలో పుట్టి, చెన్న పట్నం చేరుకుని, తెలుగుపాటలకు సంగీతం సమకూర్చి ఇంత వైవిధ్యం ఉన్న కళాకారుడు చాల అరుదు. రచయితకు పూర్తి స్వతంత్ర్యం ఇచ్చి సాహిత్యానికి తగ్గ బాణీ కట్టే సంగీతదర్శకులలో కె.వి.మహదేవన్ గారిని ప్రముఖంగా చెప్పవచ్చును. ఈ ప్రక్రియ చాల కష్టమైనది. అనితరసాధ్యమైన ఈ యజ్ఞాన్ని అతి సులువుగా నిర్వహించి సగటు తెలుగు శ్రోతలకు అమృత తుల్యమైన సంగీతాన్ని ప్రసాదించిన మహానుభావుడు శ్రీ మహదేవన్ గారు. అయితే సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టుకోవడం ఎందుకు. హాయిగా రచయితకు ఒక బాణీ పడేసి దానిలో ఇమిడేటట్లు పాటరాయమంటే పోలా? అనుకునే కోవకు చెందిన చాలమంది సంగీతదర్శకులు మనకు కోకొల్లలు.

రావు (శిరా కదంబం) గారి రూపకంలోని మామ ముత్యాలు నేను గ్రహించినవి: 
ఏమనెనోయి ఆమని రేయి, కోడెకారు చిన్న వాడా వాడిపోని వన్నెకాడా, హాయిగా తీయగా అనురాగం పండగా ఆనందం నిండగా, శిలలపై శిల్పాలు చెక్కినారు (మంచి మనసులు)[ఇదే సినిమాలోని "మావ మావ మావ.." అదిరిపోయే పాట ఈనాటికీ], చదువురానివాడవని దిగులు చెందకు (ఆత్మబంధువు), ముద్ద బంతి పూవులో మూగకళ్ళ ఊసులు (మూగమనసులు); మెల్లమెల్ల మెల్లగ (దాగుడుమూతలు) చిటపటచినుకులు పడుతూఉంటే (ఆత్మబలం); అదిగో నవలోకం (వీరాభిమన్యు), వెన్ ఐ వాజ్ యంగ్ - అత్త వడి పువ్వువలె మెత్తననమ్మ (నమ్మినబంటు), దివి నుండి భువికి దిగివచ్చె దిగివచ్చె (కన్నె మనసులు), కొత్త పెళ్ళికూతురా రా రా (సుమంగళి), నీవు నా ఊహలందే నిలిచావు (ఇల్లాలు), నిను వీడని నీడను నేనే (అంతస్థులు), ఈ ఉదయం నా హృదయం (కన్నె మనసులు), సోగ్గాడే చిన్ని నాయనా (ఆత్మబలం), వినరా సోదర భారత యోధుల విజయ గాధ నేడు; ఎవరికి వారె ఈ లోకం రారు ఎవ్వరు నీ కోసం (సాక్షి), గుండె ఝల్లు మన్నది అందె ఘల్లు మన్నది (ప్రాణ మిత్రులు), ధనమేరా అన్నిటికీ మూలం (లక్ష్మీ నివాసం), రావమ్మ మహలక్ష్మి రావమ్మా (ఉండమ్మా బొట్టు పెడతా), ఏమిటో ఇది ఏమిటో పలుకలేని మౌనగీతి (భలే రంగడు), గుట్టమీద గువ్వ కూసింది (బుద్ధిమంతుడు),

మనసే కోవెలగా మమతలు మల్లెలుగా (మాతృదేవత), మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో (అదృష్టవంతులు), పాపాయి నవ్వాలి పండగే రావాలి (మనుషులు మారాలి), తోటలో నారాజు (ఏకవీర), మహాబలిపురం.. భారతీయ కళా జగతికిది గొప్ప గోపురం (బాలరాజు కథ), నా హృదయపు కోవెలలో (ఇద్దరు అమ్మాయిలు), పాండవులు పాండవులు తుమ్మెదా (అక్కాచెల్లెలు), రానిక నీకోసం సఖీ (మాయనిమమత), చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన (చెల్లెలి కాపురం), ఏయ్ మానవుడా విన్నావా, వెడలెను కోదండపాణి (సంపూర్ణరామాయణం), అందమైన తీగకు పందిరుంటే చాలును (భార్య బిడ్డలు), చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి (విచిత్ర బంధం); ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో (అత్తలు-కోడళ్ళు); నీ నగుమోము నా కనులార కడదాక కననిండు (బడిపంతులు); రాధను నేనైతే నీ రాధను నేనైతే (ఇన్స్పెక్టర్ భార్య); ఆకలయ్యి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు (దేశోద్ధారకులు); చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది (బంగారుబాబు); మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ లోకంలో ఎంత మోసం; మల్లె పందిరి నీడలోన జబిల్లి (మాయదారి మల్లిగాడు); పలుకే బంగారమాయెనా (అందాల రాముడు); అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మ లాగే ఉన్టుంది (మంచివాడు); చంటిబాబు ఓ బుజ్జిబాబు (అందరూ దొంగలే);  ఎక్కడి వాడో గాని చక్కనివాడే; మల్లె కన్న తెల్లన మా సీత సొగసు (ఓ! సీత కథ); నవ్వులు రువ్వే పువ్వమ్మా (మాయదారి మల్లిగాడు); సోగ్గాడు లేచాడు చూచి చూచి నీ దుమ్ము లెపుతాడు (సోగ్గాడు); సాకేత సార్వబౌమా (శ్రీ రామాంజనేయ యుద్ధం); కలువకు చంద్రుడు ఎంతో దూరం (పునాది రాళ్ళు); శ్రీరామ జయరామ సీతారామ (ముత్యాల ముగ్గు); అంజలిదే గొనుమా ప్రియతమా మంజుల బృందానికుంజ నిరంజ (ప్రేమబంధం); చూరట్టుకు జారుతాది చిటుక్కు చిటుక్కు వాన చుక్క; ఝుమ్మంది నాదం సై అంది పాదం (సిరిసిరి మువ్వ); మన జన్మ భూమి బంగారు భూమి; మొరటోడు నా మొగుడు మోజు పడి తెచ్చాడు (సెక్రటరీ); శుభమస్తు శుభమస్తు అన్నదీ గుడి గంట; నేల మీది జాబిలీ (రాజా-రమేష్); మనిషై పుట్టిన వాడు కారాదు మట్టిబొమ్మ - కృషి ఉంటే (అడవి రాముడు); నేనొక ప్రేమ పిపాసిని (ఇంద్ర ధనుస్సు); అనురాగ దేవత నీవే (కుమార రాజా); గోరంత దీపం కొండంత వెలుగు (గోరంత దీపం); సుప్రభాత సున్దరి నీవు ఉదయ రాగ మన్జరి నేను (సాహసవంతుడు); విరిసిన సిరిమల్లీ; ఒరబ్బా ఏసుకున్నా కిళ్ళీ (యుగంధర్); పాలవెల్లి లో పుట్టిన తల్లి నా తల్లి విరిసిన సిరిమల్లి; ఏ గీత గీసినా నీ రూపమె (ముత్తైదువ);  

 కొమ్మ కొమ్మకో సన్నాయీ (గోరింటాకు); మానస సంచరరే (శంకరాభరణం); కంచికి పోతావా కృష్ణమ్మా (శుభోదయం); రాజ్యము బలము మహిమా నీవే నీవే (కరుణామయుడు); ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య; వమ్శీ కృష్ణా యదు వంశీ కృష్ణా (వంశ వృక్షం); ఆడాళ్ళూ మీకు జోహార్లు (ఆడవాళ్ళు మీకు జోహార్లు); నెమలికి నేర్పిన నడకలివీ (సప్తపది); తెర తీయగ రాదా; వందనాలు వందనాలు వలపుల హరిచందనాలు (జేగంటలు); శ్రీ మన్మాహా; ఆకేసి పప్పేసి బువ్వేసి నెయ్యేసి తనకో ముద్ద నాకో ముద్ద (అభిమన్యుడు); దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదర (మంగమ్మగారి మనవడు); ఘల్లు ఘల్లున కాళ్ళ గజ్జెలందెలు మ్రోయ (జననీ జన్మభూమి); కొమ్మలో కూసింది ఓ కోయిలా కొమరాకు గమకాల సన్నాయిలా (కొత్త పెళ్ళికూతురు); కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే (సీతారామ కళ్యాణం); మా తెలుగు తల్లికి మల్లె పూదండ; సురుచిర సుందర వేణి మధురస మంజుల వాణి (ముద్దుల కృష్ణయ్య); ఆది భిక్షువు వాడినేది కోరేది (సిరి వెన్నెల); తెలవారదేమో స్వామి నీ తలపుల మునుకలో అలసిన దేవేరి (శృతి లయలు); తుమ్మెద ఓ తుమ్మెదా ఎంత తుంటరోడే గోవిందుడు తుమ్మెదా (శ్రీనివాస కళ్యాణం); నా గొంతు శ్రుతిలోన నా గుండె లయ లోన (జానకి రాముడు); ఆ మామయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు (ముద్దుల మామయ్య); జేసుదాస్ పాడిన నగుమోము గనలేని నా జాలి (అల్లుడుగారు); మనసులోని మర్మములు తెలుసుకో (నారి నారి నడుమ మురారి); అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచు వలె (అసెంబ్లీ రౌడీ); సంగీత సాహిత్య సమలంకృతే (స్వాతి కిరణం). 
  

11 కామెంట్‌లు:

  1. ఎన్ని పాటలను గుర్తు పెట్టుకున్నారండి. వీటిల్లో కొన్ని పాటలు రేడియోలో వినేవాళ్లం. (అంతపాత సినిమాలు చూడకపోయినా )
    వీటిల్లొ నాకు నచ్చినవి ఎన్నో ఉన్నాయి.
    నిజంగా మహదేవన్ స్థానం తెలుగు వారి గుండెల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  2. సూర్యనారాయణ గారూ !
    మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలియడం లేదు. మామ గురించి ఒక్కసారి అందరికీ గుర్తు చేయాలని ఆ ప్రయత్నం చేశాను. దీనికి మొత్తంగా పది గంటలపైన పట్టింది. అక్కడికీ ఇంకా చాలా పాటలు మిగిలిపోయాయి. అప్పటికే చాలా ఆలస్యమైందని ప్రచురించేశాను. మీరు ఆ టపా మీద అంతా శ్రద్ధ తీసుకుని ఇంత పెద్ద టపా రాయడం మామ మీద మీకున్న అభిమానాన్ని తెలుపుతోంది. మీరు చాలావరకూ చిత్రాల పేర్లు సరిగానే రాశారు. కానీ కొన్ని పేర్లు సరిగా గుర్తించలేకపోయారు. అది సహజం. మీ టపా చదివాక దీన్ని ఒక క్విజ్ లా ఇస్తే బావుంటుందనిపించింది. మీలా ఎంతమంది మామ పాటల్ని గుర్తు పెట్టుకున్నారో తెలుసుకోవాలని కుతూహలంగా వుంది. తర్వాత పూర్తిగా అన్ని పేర్లు ప్రచురిస్తాను. మరోసారి ధన్యవాదాలతో .........

    రిప్లయితొలగించండి
  3. మందాకిని గారికి ధన్యవాదాలు.

    రావు గారూ, మీరు శ్రమించినదానిలో నాదెంత. ఆ స్పందన కలిగించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. suryanarayana garu, remembered the quality songs at once place, thank you - subbarao k

    రిప్లయితొలగించండి
  5. శ్రీ సుబ్బారావు గారికి ధన్యవాదాలు. రావు గారు (శిరాకదంబం) నా పని సుళువు చేసారు. ఘనత వారిదే.

    రిప్లయితొలగించండి
  6. Sir, your incredible accomplishment is no less than the yoemen service done by Sri Sr Rao garu.
    As for me, I just pressed the play button and wa lost for the next one hour.

    రిప్లయితొలగించండి
  7. కొత్త పాళీగారికి ధన్యవాదాలు. నిజానికి బ్లాగుప్రపంచానికి నేనొక (సరి)కొత్తపాళీని. అంటే ఈమధ్యనే లిఖించడం ప్రారంభించాను. ప్రపంచగవాక్షం నుండి వీక్షించాలన్న తాపత్రయం. మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  8. చాలా బావున్నాయండి. ఎంత కష్టపడి రాసారో తెలుస్తూనే ఉంది. అదే చేత్తో ఆయా పాటల ఆడియో లింకులు ఇచ్చి ఉంటే మీకు మరింత పుణ్యం దక్కేది కదా??? ఇది కొంచెం కష్టమే కాని అసాధ్యం కాదు...:))

    రిప్లయితొలగించండి
  9. జ్యోతి గారు, ధన్యవాదాలు. ఆ పుణ్యం రావుగారు ఎప్పుడో కట్టుకున్నారు. క్రింది లింకు చూడండి. నేను రావుగారి యజ్ఞంలో ఒక సమిధను మాత్రమే.
    http://sirakadambam.blogspot.com/2010/12/blog-post_552.html

    రిప్లయితొలగించండి
  10. ఇప్పుడే ఈ ఐటమ్ చదివాను. బాగుంది. అయితే మాయని మమత సినిమాకు మహదేవన్‌ కాదు సంగీతాన్ని అందించింది. అశ్వత్థామ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాల గారు, నమస్కారం. నా బ్లాగు దర్శించినందుకు ధన్యవాదాలు. మీరు సూచించినది సరి. ఆ చిత్రానికి సంగీతం అశ్వత్థామ. మహదేవన్‌ కాదు.

      తొలగించండి

Blog Junctions