అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
సరదా తెలుగు క్విజ్ - 1 సమాధానాలు:
1. బౌద్ధుల ఆరామము/తిరుగుట - విహారము; 2. ఉనికిని తెలిపేది - విలాసము (చిరునామా); 3. ఎగిరే యంత్ర సాధనం - విమానము; 4. జ్ఞానాన్ని పెంపొందించుట - వికాసము; 5. ఖగము - విహంగము; 6. వేడుక / సరదా -వినోదము; 7. మేధస్సు - విజ్ఞానము; 8. రోగము - వికారము; 9. దైన్యము -విదారము; 10. ఏడుపు - విలాపము; 11. గొప్ప బాధ - విషాదము; 12. తలకిందులుగా - విలోమము; 13. కళాకారునికి ఉండవలసినది - వినయము; 14. హాస్యము /మిక్కిలి వంకర గల - వికటము/విగటము; 15. పెద్ద దెబ్బ/అడ్డు - విఘాతము; 16. అతిగా ప్రేమించు - విమోహము; 17. అయిష్టము - విముఖము; 18.అడవి - విపినము; 19. సంపద/గొప్పదనము - విభవము; 20. కలయిక - విలీనము; 21. నల్లని రంగు - వినీలము; 22. పధ్ధతి - విధానము; 23. మనవి - విన్నపము; 24. నిర్దేశించబడినది - విద్యుక్తము; 25. గెలుపు - విజయము; 26. రకరకాలైనది - వివిధము; 27. తగువు - వివాదము; 28. శత్రుత్వం - విరోధము; 29. అమరిక - విన్యాసము; 30. తెలివి - వివేకము; 31. తొడుగు - వితానము; 32. రోత పుట్టించు ఆకారం - వికృతము; 33. నమ్మకము - విశ్వాసము; 34. చెప్పినట్లు విను - విధేయము; 35. పరిశుద్ధ మైనది - విమలము.
పాల్గొన్న ఔత్సాహికులు మందాకిని గారికి, భమిడిపాటి సూర్య లక్ష్మి గారికి ధన్యవాదాలు.
nallani rangu ante vineelamu annaru kada .. ante vineelakasamu ante nallani aakasamu ani ardhama?
రిప్లయితొలగించండిtheliya cheyagalaru ?
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిSRRao
శిరాకదంబం
వర్మ గారికి నమస్కారము. మీ సందేహము కొంతవరకు సరియైనదే. "వినీలము" అంటే నిజానికి కేవలం నల్లని అని కాదు. "డార్క్ బ్లూ" అని అర్థం. ఉదాహరణకి "కృష్ణ" అన్న పదానికి నలుపు అని అర్థం. అయితే శ్రీకృష్ణుడిని నీలమేఘ శ్యాముడు అంటాం. ప్రత్యక్షంగా నలుపుతో పోల్చకుండా, చిక్కని నీలవర్ణంతో పోలుస్తారు. అలాగె "వినీలము" ను నల్లనితో పోల్చడం జరిగింది. మీ ఆసక్తికి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిరావు గారికి, ధన్యవాదాలు. మీకు కూడ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడచిన సంవత్సరంలో మీతో పరిచయం అదృష్టం. కొత్త సంవత్సరం మరిన్ని కొత్త విషయాలు తెలుసుకుంటామనే ఆశాభావంతో ..
రిప్లయితొలగించండి