తెలుగు పదాలను గుర్తు చేసుకోవడానికి చాల మంది ఉత్సాహం చూపిస్తున్నందుకు నాకూ సరదాగా ఉంది. మీకు మరో మెట్టు ఈ మూడవ క్విజ్. ఇందులో 25 - నాలుగక్షరాల (four-letter) పదాలు దిగువన ఇచ్చిన ఆధారాలతో కనుక్కోవాలి. ప్రతి పదములో నాల్గవ (ఆఖరి) అక్షరం తప్పని సరిగా 'క' రావాలి. అంటే మీరు అన్ని పదాలకి మొదటి మూడు అక్షరాలు కనుక్కోవాలి.
ఆధారాలు:
1. ఉజ్జయిని రాజకుమారి; 2. పేరు లేనిది/ఒక వేలు; 3.కాశీరాజు కుమార్తె (మహాభారతం); 4. ఒక గ్రహం; 5. ఒక రాగం; 6. విత్తనాలు నాటే సమయం; 7. పుర్రెను బొచ్చెగా వాడేవాడు; 8. విడిపోయి తిరిగి ఒక దగ్గర చేరడం; 9. చలనము; 10. జంతుప్రదర్శన శాల (ఆంగ్లపదం) తరువాత ఈ నాల్గక్షరాలు చేరిస్తే వచ్చే సినిమా పేరు; 11. చంద్రముఖి సినిమా లోని ఊతపదం; 12. ఎండమావి - వేటూరి పాటలో ఉంది; 13. పుప్పొడి; 14. ఈ రోగులకు అమావాస్యకి పున్నమికి అదుపు ఉండదు; 15. మంచు బిందువులు; 16. ఈ వర్గానికి ఎన్నికలతో సంబంధం; 17. సారాంశం; 18. దీనితో మొదలెట్టి బ్రహ్మ వరకు; 19. రాజకీయ మేల్కొలుపు అరుపు; 20. ప్రశ్నార్ధకం; 21. నుడికట్టు లేదా గడికట్టు; 22. 'సంప్రతి వార్తాహ సృయంతాం _ _ _ క బలదేవానంద సాగరః'; 23. పథకము; 24. సముద్ర సంబంధమైన; 25. బ్రాహ్మి తలనూనె లోని కాయ.
1)---- 2) అనామిక, 3) అంబాలిక, 4) అంగారక, 5) చక్రవాక, 6) ఏరువాక, 7) కపాలిక, 8) కలయిక, 9) కదలిక, 10) జురాసిక, 11) లకలక, 12) మరీచిక, 13) మధూలిక, 14) మానసిక, 15) తుషారిక,16) సామాజిక, 17)---- 18) ---- 19) ---- 20) ---- 21) ప్రహేళిక, 22) ప్రవాచిక, 23) హవణిక, 24) సాగరిక, 25) ఉసిరిక.
రిప్లయితొలగించండి1 అవంతిక
రిప్లయితొలగించండి2 అనామిక
4అంగారక
8కలయిక
9 కదలిక
10 లకటక
11 లకలక
12 మరీచిక
14 మానసిక
15 నీహారిక
18 పిపీలిక
21 ప్రహేళిక
22 ప్రవాచక
23 సాముద్రిక
1. అవంతిక/మదనిక/మాళవిక 2. అనామిక 3. అంబాలిక 4. అంగారక 5. చక్రవాక 6. ఏరువాక 7. కాపాలిక 8. కలయిక 9. కదలిక 10. జూ లకటక 11. లక లక 12. మరీచిక 13. పరాగక 14. మానసిక 15. నీహారిక 16. సామాజిక 17. నివేదిక 18. పిపీలిక 19. పొలికేక 20. ప్రవల్లిక 21. ప్రహేళిక 22. ప్రవాచక 23.ప్రణాళిక 24. సాగరిక 25. ఉసిరిక
రిప్లయితొలగించండిచూసి ఎన్ని తప్పులున్నాయో చెప్పండి.- వేదుల సుభద్ర
సూర్య లక్ష్మిగారికి, మందాకిని గారికి, సుభద్ర గారికి ధన్యవాదాలు. మీ ఉత్సాహానికి అభినందనలు. జవాబులు, స్కోరు తరువాతి పోస్ట్ లో చూడగలరు.
రిప్లయితొలగించండి