6, అక్టోబర్ 2011, గురువారం

అమెరికా అనుభవాలు: బొమ్మలు చెప్పిన కథ

సరా సరదాలలో మన సంస్కృతిని, అభిరుచులని ప్రతిబింబించే ప్రయత్నం బొమ్మలకొలువు. ఇది ముఖ్యంగా దక్షిణాది సంప్రదాయం. ఈ సంవత్సరం మా ఊర్లో (కేరీ, నార్త్ కరోలినా; ర్యాలీకి దగ్గర) బొల్లాప్రగడ లీనా, విజయ్ ల ఇంట్లో బొమ్మల కొలువును సందర్శించాం.  లీనా గారు ప్రతి సంవత్సరం బొమ్మల కొలువు పెడతారు. మెట్ల పై బొమ్మలు అమర్చి కొలువు తీర్చుతారు అందరు. వాటికి అనుబంధం గా ఒక్కొక్క ఇంటి వారు తమ తమ ఆలోచనలకు, సృజనాత్మతకు రూపు దిద్ది కొన్ని వెరైటీలు జోడీ చేస్తుంటారు.   అయితే ఒక్కో సంవత్సరం ఒక ప్రత్యేకమైన "శీర్షిక" (theme) ను తీసుకుంటుంటారు. క్రింది వీడియో లో బొల్లాప్రగడ దంపతులు మరియు వారి పిల్లలు వాళ్ళ దసరా సరదాలను, వారి అనుభవాలను వివరించారు.
 
 బొల్లాప్రగడ వారి బొమ్మల కొలువు 

ఈ సంవత్సరం "కృష్ణుడు" తన శీర్షిక. ఈ థీం కోసం శ్రీ కృష్ణ జననం, వసుదేవుడు బాల కృష్ణుని తో యమునను దాటి గోకులం చేరడం, కృష్ణుడు యశోదా నందనుడై గోకులం లో పెరగడం, కాళీయ మర్దనం, కృష్ణుని అల్లరి పనులు, రాధ తో రాసలీలలు, జలక్రీడలు, గోపికలతో సరస సల్లాపములు, గోవర్ధన గిరి నెత్తడం, కంస వధనం, శ్రీ కృష్ణ నిర్యాణం, వైకుంఠ గమనం మొదలయిన అంశాలన్నీ చాల చక్కగా, పొందికగా అమర్చిన  బొమ్మల విన్యాసం మరియు అలంకరణలతో అందంగా తీర్చిదిద్దారు లీనా గారు. 

ఈ ప్రాజక్టు కోసం ఇంటిల్లిపాదీ పాలు పంచుకున్నారు. లీనా గారితో పాటు, వారి భర్త శ్రీ విజయ్ గారు, వారి పిల్లలు అందరూ సహకరించి ఈ ప్రాజక్టును దిగ్విజయంగా పూర్తి చేసి శోభాయమానంగా తయారు చేసారు.  ఇండియాకు, అమెరికాకు తేడా ఏమిటంటే, అమెరికాలో బొమ్మల కొలువు సంబరంలో ఆడా, మగా, పిల్లలూ అందరినీ ఆహ్వానిస్తారు. అందరికీ ప్రసాదం ఇస్తారు. ఆ విధంగా మాకు ఇలాంటి కార్యక్రమాలు ఉండడం వలన ప్రవాసంలో వున్నాపండుగలు, పేరంటాలు, ప్రదర్శనలు మొదలయినవి చూడటం, వాటిలో పాల్గొనడం వలన చిన్నప్పటి అనుభవాలు, అనుభూతులు నెమరు వేసుకున్టుంటాం.  
అందరికీ దసరా శుభాకాంక్షలు 

9 కామెంట్‌లు:

  1. సూరి గారు,
    ముద్దుగా ' ముద్దుగారే ... ' పాడారు. బాగుంది
    మిమ్మల్ని చూసి నేను కూడా ఎప్పుడో పాడేసే ప్రమాదం ఉంది.
    దసరా శుభాకాంక్షలు !!

    రిప్లయితొలగించండి
  2. chaalaa baagundandee! Vijay garu,Leena gaariki abhinandanalu teliya jaeyandi. manchi vishayam panchukunnaaru.Thank you very much.

    రిప్లయితొలగించండి
  3. ఆత్రేయగారు, ధన్యవాదాలు. విజయదశమి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  4. వనజ వనమాలి గారు, ధన్యవాదాలు. తప్పకుండా చెబుతాను వారికి. విజయదశమి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  5. అజ్ఞాత గారికి, ధన్యవాదాలు. నిజానికి లీనా గారు తెలుగులో చాల బాగా మాట్లాడుతారు. వారిని ఇంటర్వ్యూ చేసే ముందు అడిగాము. అయితే వారికి చాల మంది సహోద్యోగులు, తమిళ, కన్నడ, హిందీ మిత్రులు వున్నారు. వారికి అర్ధం కాదు. అంతేకాక ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు అందరూ ధారాళంగా తెలుగులో మాట్లాడలేరు. వీరందిరిని కూడ దృష్టిలో పెట్టుకుని ఆంగ్లంలో మాట్లాడటం జరిగింది. విజయదశమి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  6. It is nice that video is in english, we need to crete awareness to rest of the world in addition to non Telugu Community of India.

    రిప్లయితొలగించండి
  7. Thanks Suri garu for posting video. We always heard how great Leena garu does it but this is the first time we watched it. Thanks!

    రిప్లయితొలగించండి

Blog Junctions