5, అక్టోబర్ 2011, బుధవారం

రాలీ, నార్త్ కరోలినాలో గాంధీ జయంతి సందర్భంగా మహాత్మునికి నివాళులు

క్టోబరు, 2, 2011, Raleigh, NC.  అమెరికా లోని  నార్త్  కరోలినాలో రాష్ట్రానికి రాజధాని అయిన ర్యాలీ నగరంలో "Heritage India Association, NC" అధ్వర్యంలో గాంధీజయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.  గాంధీ స్టేట్యూ ప్రాజెక్టును డా.అరవింద్ షా 2005 లో ప్రారంభించారు. డా. షా  నేతృత్వంలో ప్రాజక్టు ప్రెసిడెంటు గా నియమించ బడిన శ్రీమతి యశ్ గార్గ్, వైస్ ప్రెసిడెంట్ హర్ష షా మరియు వివిధ వాణిజ్య సంస్థలు, స్వచ్చంద సేవకులు, స్థానిక "ఎక్స్ ప్లోరిస్" మ్యూజియము వారు కలసి ఈ ప్రాజక్టు ద్వారా చందాల రూపంలో, సౌజన్య రూపంలో నగదు సేకరించి ర్యాలీ నగరం డౌన్ టౌన్లోగల మ్యూజియము ప్రాంగణం లో జాతి పిత మహాత్మా గాంధీ విగ్రహం 2006 లో ప్రతిష్టించారు.  ఈ విగ్రహాన్ని భారత దేశంలో తయారు చేయించి, తీసుకు వచ్చే బృహత్తర భారాన్ని శ్రీ వంగూరి ప్రసాద్ గారు (past president of IAFPE-NC Chapter) చేపట్టారు.  హెరిటేజ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవంలో పలువురు స్థానిక భారతీయులు పాల్గొన్నారు.


ఈ కార్యక్రమంలో తొలుత డా. షా గారు ఈ ప్రాజక్టు పూర్వోత్తరాలు వివరించారు.  తదుపరి శ్రీ దేవలపల్లి ప్రకాష్ గారు పరిచయ వాక్యాలు పలికారు.  అటు పిమ్మట మహాత్మా గాంధీ విగ్రహానికి ప్రముఖ శాస్త్రవేత్త శ్రీ జగదీశ్ నారాయణ్ గారు పూల మాల వేసి తనకు గాంధీ గారి సిద్ధాంతాలతో గల అనుభవాన్ని వివరించారు.  కార్యక్రమానికి హాజరైన ప్రతి వొక్కరూ ముక్త కంఠంతో "రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం, ఈశ్వర అల్లా తేరో నామ్, సబ్ కో సన్మతి దే భగవాన్" అని ప్రార్థించారు.  తరువాత ఆడిటోరియం లో HSNC కి చెందిన శ్రీమతి సరోజ్ శర్మ గారు జ్యోతిని వెలిగించి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభింప జేజారు. స్థానిక భారతీయ సంతతికి చెందిన రెండవ తరం పిల్లలు నృత్య, గాన కార్యక్రమాలతో సభాసదులను అలరించారు. పలువురు బాల బాలికలు గాంధీ గారి చాయా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసారు. "గాంధీని పోలిన" (Gandhi look-alike) వస్త్ర ధారణ పోటీలో గెలుపొందిన బాలురకు బహుమతులు పంచి పెట్టారు.

 గాంధీ ప్రోజక్టుకు సంబంధించిన కొంత సమాచారాన్నిఈ వెబ్ సైట్ నుండి గ్రహించడమైనది : http://www.apnatriangle.com/Apna-Triangle-Articles/gandhi-statue-rtp 
Person interviewing in Gandhi T-Shirt: Suryanarayana Vulimiri
Video is Curtesy of Gowri Goli.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Blog Junctions