12, జనవరి 2011, బుధవారం

సరదా క్విజ్ -2 సమాధానాలు - చిరు కవిత

 రెండక్షరాల పదాలు అన్నీ "ట" తో అంతమయ్యేవి ఇవి:
1. పగులు - బీట; 2.  గళాసు - లోట; 3. రోజులో సగం - పూట;  4. చీరలో భాగం - పైట; 5. రాజుండేది - కోట;  6. ఊరిలోని భాగం - పేట; 7. చెత్త - పెంట; 8. అడవిలో చేసేది - వేట;  9. ఒక రాగం - నాట; 10. క్రీడ - ఆట; 11. స్వచ్చము - తేట; 12.ఊడలమర్రి - వట; 13. పలుకు - మాట; 14. భావానికి రాగం తోడైతే - పాట; 15. ఇది నొక్కితే వెలుగుతుంది బల్బు - మీట;  16. మ్రోగేది - గంట; 17. చేరిగేది - చేట; 18. వనం - తోట ;  19. శివునికుండేది - జట; 20. దారి - బాట


పాల్గొన్న ఔత్సాహికులు: మహెక్ గారు, మందాకిని గారు, ఆత్రేయ గారు, మరియు వరలక్ష్మి గారు. అందరికీ ధన్యవాదాలు.  

ఈ క్విజ్ అయ్యాక ఏదో ఊహ పుట్టింది. అప్రయత్నంగా శ్రీ జంధ్యాల గారు గుర్తుకొచ్చారు. వారైతే పదాల ప్రాసలతో అందరినీ అలరిస్తారు (ఉదా. వేటగాడు, అడవి రాముడు). సరదాగా క్విజ్ సమాధానాలతో ఒక కవిత వ్రాస్తున్నాను. ఏదో అన్ని పదాలు ఉపయోగించి ఒక ఇతివృత్తం తీసుకు రావాలనే ప్రయత్నం. బహుశా ఆ ఇతి వృత్తం "ప్రేమ" రూపం దాల్చింది. అయితే కొన్ని పదాలు చాల కష్టమైనవని ముందే ఊహించి ఉంటే నా క్విజ్ వేరేలా మార్చగలిగే వాడినేమో!

సరదా సమాధానాలతో చిరు కవిత 
బీటలు వారిన నా గుండె కోటను చేరగ
చెలి తన మాటలతో పూలజటలను పేని 
ప్రేమతోటకు వలపుబాటను వేసి 
హృదయ వీణను మీటగనే ఈ పూట 
నా డెందమునకు ఆడింది ఆట పాడింది పాట 
సుతారంగా తగలగ చెలి పైట 
అయ్యింది నా మోము చేట  
మ్రోగింది వలపుల గుడిగంట

తనువంతా తేటగీతి 
మనసంతా అదోరీతి
అదే మురిపెం ట!
పలికిన అద్భుత రాగం నాట
ఎదలో అనుభూతుల వేట
మెడలో ఆణిముత్యాల పేట
లోటగునా మరి దేనికైనా!
ఏమో! ఇంకేమీ తోచవట

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Blog Junctions