11, జనవరి 2011, మంగళవారం

సరదా క్విజ్ - 2

తెలుగు భాష లోని చక్కదనం ఏమిటంటే చిన్న చిన్న పదాలు ఎన్నో సమయానుకూలంగా వాడుతుంటాం. 
      అది అలా ఉంచి..ఈ క్రింది ఆధారాల సహాయంతో రెండక్షరాల పదాలు కనుక్కోండి. ప్రతి పదానికి రెండవ అక్షరం "ట". చాల సులభమైన క్విజ్'ట'. సరదాగా..బ్లాగక్షేపం కోసం..


1. పగులు; 2.  గళాసు; 3. రోజులో సగం;  4. చీరలో భాగం; 5. రాజుండేది;  6. ఊరిలోని భాగం; 7. చెత్త; 8. అడవిలో చేసేది;  9. ఒక రాగం; 10. క్రీడ; 11. స్వచ్చము; 12.ఊడలమర్రి; 13. పలుకు; 14. భావానికి రాగం తోడైతే; 15. ఇది నొక్కితే వెలుగుతుంది బల్బు;  16. మ్రోగేది; 17. చేరిగేది; 18. వనం;  19. శివునికుండేది; 20. దారి.

6 కామెంట్‌లు:

  1. 1. బీట 2. లోట 3. పూట 4. పైట 5. కోట 6. పేట
    7. ?
    8. వేట
    9. ?
    10. ఆట 11. తేట
    12.వట (వృక్షము)?
    13.మాట 14.పాట 15.మీట 16.గంట 17.చేట 18.తోట 19.జట 20.బాట

    రిప్లయితొలగించండి
  2. బీట, లోట, పూట, పైట, కోట, పేట, పెంట, వేట, ---, ఆట, తేట, ---, మాట, పాట, మీట, గంట, చేట, తోట, జట, బాట.
    పెంట అంటే చెత్త అనే అర్థంలో వాడుతున్నారు. నిజానికి పేడ అని అర్థమనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  3. మహక్ గారు, ధన్యవాదాలు. మీస్కోరు 18. మందాకిని గారు, మీకు కూడ ధన్యవాదాలు. మీ స్కోరు కూడ 18. ఇద్దరికీ చిక్కనిది ఒక రాగం పేరు. కనుక్కోగలరా?

    రిప్లయితొలగించండి
  4. 9 ) 'నాట' రాగం మిగతావి అన్నీ ఇద్దరు అక్కలు రాసేసారు కదా

    రిప్లయితొలగించండి
  5. ఆత్రేయ గారు, వరలక్ష్మిగారు. కరక్ట్. రాగం నాట. నటకాదు. అప్పుతచ్చు (అచ్చుతప్పు) అయ్యివుండవచ్చు. ఎలాగైతేనేం. మీరు పూర్తిచేసారు. ధన్యవాదాలు. ఉత్సాహంగా పాల్గొన్న అందరికీ నెనర్లు.

    రిప్లయితొలగించండి

Blog Junctions