10, జనవరి 2011, సోమవారం

బ్లాగోపాఖ్యానం

మిటీ ఈ బ్లాగోపాఖ్యానం అనుకుంటారా బ్లాగరులూ. బ్లాగు రాయడం మొదలెట్టాక రక రకాల బ్లాగక్షేపాలు దొరుకుతున్నాయి.  ఏదో ఒకరి బ్లాగోగులు ఇంకొకరికి చెప్పుకునే బ్లాగరాయణ  సంబంధం. 

      ఆ మాత్రం బ్లాగక్షేపం లేకపోతె ఏం బ్లాగుంటుంది?  ముళ్ళపూడి గారు అన్నట్లు, "పొద్దస్తమానం తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటది?"  

      స్పందన లేని నిత్య కృత్యం లో "బ్లాగు నైనా కాకపోతిని బ్లాగరులందరు చదవగా"..అని వాపోవాలి.  ఉద్యోగం పోయిన మాజీ గవర్నరు ఆఫ్ ఇల్లినోయ్ బ్లాగోయవిచ్ కే తప్పలేదు. మనమెంత?  ఏదో బ్లాగరులం.

      బ్లాగులు రాసే బ్లాగ్య లక్ష్మి బ్లాగ్ ఫ్రెండ్ ను ఏమని అడిగిందో తెలుసా!
"గాజులైతే తొడిగాడు నా రాజు ..నా బ్లాగులన్నీ చదివేది ఏ రోజు" అని.

      సలహా అడిగితే, "బ్లాగు రాయాలంటే మాటలా! బ్లాగిన్ అవగానే బ్లాగు రాస్తాను అనడానికి"  అన్నాడొక సీనియర్ బ్లాగిస్టు బ్లాబ్జీ. 

      "అందరూ బ్లాగులు రాసేవారే అయితే,  మరి చదివే వారెవరు?"  విసుక్కున్నాడు.  "బ్లాగే ముందు తెలుసుకో బ్లాగ్గురించి" వారించాడు.

       "బ్లాగంటే తెలుసా నీకూ..తెలియందే బ్లాగించకు" అని పీకాడొక క్లాసు ఆ బ్లాసు.  మళ్ళీ ఇలా అన్నాడు.  

      "చూడు బ్లాబూ!  బ్లాగులు పలు రకాలు. పిల్లలు గీసే బొమ్మల బ్లాగులు,  పెద్దలు చదివే బొమ్మల (?) బ్లాగులు,  సమస్యా పూరణాలు,  సమోసాలు-పూర్ణాలు,  మోసాల రాజకీయాలు,  ద్వేషాల బ్లాగ్యుద్ధాలు, చక్కని చందమామ కథలు-తిక్క సందేహాలు,  కవితలు-తవికలు, స్వగతాలు-అసంగతాలు,  సంభాషణలు-సంబోధనలు, సంగీత-సాహిత్యాలు, కమర్శియల్సు - విమర్శల జల్సు, కష్టమ్స్ - సుఖమ్స్, కాదేదీ బ్లాగు కనర్హం  అనిపించే కవితా వస్తువులు.  

      ఇంకా చెప్పాలంటే, ఆలోచలనల ముడి సరుకులను  మెదడు జల్లెడలో జల్లించి, మనసుకు మాలికలా సమర్పించి,  నాల్గు రోడ్ల కూడలిలో భుజించిన సమాహారం, సమూహం గా కలసి తినే షడ్రసోపేత భోజనం.  

బ్లాగు బ్లాగు. బ్లాగు అంటే ఇంత బ్లాగోతం ఉందన్న మాట.  బ్లాగోయ్! బాబోయ్!

9 కామెంట్‌లు:

  1. బ్లాగంటే బ్లాగూ కాదూ...కామెంటూ కానే కాదూ....
    పదిలంగా అల్లూకున్న ఎద రొదలే మనవీ ...ఎద రొదలే మనవీ...

    రిప్లయితొలగించండి
  2. ఇక లాభం లేదు నేను కూడా బ్లాగుడుకాయలు చుట్టి కూడలి గోడల మీద పేల్చాల్సిందే.

    రిప్లయితొలగించండి
  3. బ్లాగుల గురించి చాల బాగా బ్లాగారండీ:) మీకు బ్లాగాభిననదనలు

    రిప్లయితొలగించండి
  4. SHANKY గారికి, జ్యోతి గారికి, ఆత్రేయ గారికి, భాను గారికి, మధురవాణి గారికి బ్లాగాభివాదం.

    రిప్లయితొలగించండి
  5. బ్లాగుల బాదరాయుడా (వ్యాస ముని), ఓ సూరి! జుర్రు జుర్రుగ బ్లాగేస్తున్నవ్ ఖాళీ సమయాలలొ ! భ్లాగు భ్లాగుగా భ్లాగై. Good Luck. It is nice.

    రిప్లయితొలగించండి

Blog Junctions