అమెరికాలో్ పండగలన్నీ వారాంతాలలోనే జరుపుకుంటాం. ఆడిటోరియం దొరకడాన్ని బట్టి పండుగ రోజుకు ఒకటి, రెండు రోజులు ఒకోసారి వారాలు అటూ ఇటుగా జరుపుకోవడం జరుగుతుంది. గతవారం నందన నామ ఉగాది మరియు శ్రీరామనవమి సంబరాలు సంయుక్తంగా ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ (TATA) వారు నిర్వహించారు. కార్యక్రమాల నిర్వహణలో నేను పాక్షిక పాత్ర వహించాను. ఈ సంబరంలో శ్రీ ఘంటసాల మాస్టారు పాడిన, భూకైలాస్ చిత్రంలోని రాముని అవతారం పాట పాడాను. వెనుక సంగీతం లేదు సరిగదా! ప్రేక్షకుల రణగొణ ధ్వని మాత్రం వుంది. అయితే నా పాట మొదటిసారి వీడియో తీయడం, యూ ట్యూబ్ లో పెట్టడం నా ప్రియ మిత్రుడు గౌరీ గోలి వలన జరిగింది. మాస్టారంటే ఉన్న ఉడతాభక్తిగా బ్లాగ్మిత్రులతో పంచుకోవాలనిపించి పోస్టు చేస్తున్నాను.
అందరికీ శుభాకాంక్షలు!
సూర్యనారాయణ వులిమిరి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి