4, సెప్టెంబర్ 2011, ఆదివారం

పదివేల చూపుల స్నేహమయము, అదివో అల్లదివో బ్లాగుల వాసము


 పదివేల
బ్లాగ్-వీక్షకులకు, మిత్రులకు కృతజ్ఞతలు
     
      నేను బ్లాగు ప్రపంచంలో అడుగు పెట్టి ఏడాది ఇంకా పూర్తి కాలేదు. పదివేల మంది రస హృదయులు నాబ్లాగ్ ను వీక్షించారు.  మీ అందరి సహకారం, స్నేహ స్పర్శ నాకెంతో స్ఫూర్తిని, ఆనందాన్ని ఇచ్చాయి. మీ అందరి సావాసం నాకు బ్లాగు నివాసం అయ్యింది.  అందుకే అనిపిస్తుంది "పదివేల చూపుల స్నేహమయము, అదివో అల్లదివో బ్లాగుల వాసము".  నా స్నేహితులు కూడా ఒకోసారి అంటుంటారు. "ఏంటండీ! మిమ్మల్ని చూసి చాల రోజులయింది.  అన్నట్లు బ్లాగుల్లో పడ్డారటగా!" అని.  అది చురకో, లేక మెచ్చుకోలో తెలియదు.  అదేదో రేసుల్లోనో, పేకాటలోనో పడ్డట్లు. అఫ్కోర్స్! ఇది కూడా అలాంటిదే. కొందరు దీన్ని వ్యాపకం అంటే కొందరు వ్యసనం అనొచ్చు.  కాని ఒకటి మాత్రం నిజం. బ్లాగులు వ్రాయడం ఒక దిన (వార) చర్య అయిపోయింది.  

        అంతరంగంలో అటునిటు దొర్లుతున్న ఆలోచనలను, స్వీయ అనుభవాలను అవగతం చేయడానికి ప్రారంభించాను నా మొదటి బ్లాగు "స్వగతం".  ఎందఱో పరిచిత మిత్రులు పలకరించారు, అపరిచితులైన రసజ్ఞులు మిత్రులైనారు. వారందరూ తమ హార్దిక స్పందన-ప్రతి స్పందనలతో సలహాలు, విమర్శలు, ఆశీస్సులు అందించారు. ఎన్నో క్రొత్త విషయాలు తెలిసాయి. ఇంకా తెలుసుకోవలసినవి చాల ఉన్నాయని తెలిసింది. ఇది ఒక అపురూపమైన చిరు ప్రారంభం.  అయితే "బ్లాగించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి" (క్షమించండి శ్రీశ్రీ గారు) అని నేనను కుంటాను. ఈ విధమైన ఆరోగ్యకరమైన పరంపర ఇలాగే కొనసాగాలని, కొనసాగుతుందని, దానికి మీ వంటి మంచి మిత్రుల సహాయ-సహకారాలైతేనేమి, అండ-దండలైతేనేమి కలకాలం ఉండాలని ఆకాంక్షిస్తూ...
ప్రవాసంలో నివాసి 
సూర్య నారాయణ వులిమిరి  
  

6 కామెంట్‌లు:

Blog Junctions