మహాత్మా గాంధి |
రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారామ్
ఈశ్వర అల్లా తేరో నామ్ సబ్ కో సన్మతి దే భగవాన్
సిరివెన్నెల గారి కలానికి ఒక రసం మాత్రమె అన్న హద్దు లేదు. భక్తీ గీతాలు, శాస్త్రీయ సంగీతానికి అనువైన విలక్షణ గీతాలు, ప్రేమ గీతాలు, విరహ గీతాలు, దేశ భక్తి గీతాలు, విప్లవ గీతాలు, ఒకటేమిటి ఏ కోణంలో చూసినా ఆయన ఒక్కో రూపాన్ని చూపిస్తారు మనకు. మహాత్మా గాంధీ పై 'మహాత్మా' చిత్రం కోసం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వ్రాసిన ఈ పాట తెలుగు హృదయాలలో కలలాలం నిలిచిపోయే పాట - ఆయన గుండెలోంచి సగటు భారతీయుని హృదయ ప్రతిధ్వని గా..
బాలు గళంలో 'మహాత్మా' చిత్రం' నుండి. అయితే సెన్సార్ కత్తెర ప్రభావం పాటలో ప్రస్ఫుటిస్తుంది. ఇందులో కొంప ములిగిపోయే అంత అభ్యంతరం ఏమిటో? ఇందిరమ్మను తొలగించి 'కొంతమంది' అని మార్చినట్లున్నారు. ఇదీ మనకుండే స్వేచ్చ. ఈ పాట చిత్రీకరణ చాల బాగా చేసారు ఈ చిత్రంలో. ఏవో పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి కంట నీరు పెట్టిస్తుండీ చరమాంకం.
చిత్రం: మహాత్మ (2009)
రచన: సిరివెన్నెల
గానం: ఎస్.పి. బాలసుబ్రమణ్యం
సంగీతం: విజయ్ ఎంతోనీ
సాకీ: రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతారామ్
ఈశ్వర అల్లా తెరో నామ్, సబ్ కో సన్మతి దే భగవాన్
చ: కొంతమంది (ఇందిరమ్మ) ఇంటి పేరు కాదుర గాంధి
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధి (2)
కరన్సీ నోటు మీద, ఇలా నడి రోడ్డు మీద
మనం చూస్థున్న బొమ్మ కాదుర గాంధి
భరతమాత తల రాతను మార్చిన విధాతరా గాంధి
తర తరాల యమ యాతన తీర్చిన వరదాతరా గాంధి
ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధి
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధి
చ: రామ నామమే తలపంతా, ప్రేమ ధామమే మనసంతా
ఆ శ్రమ దీక్షా స్వతంత్ర కాంక్షా
ఆకృతి దాల్చిన అవదూత, అపురూపం ఆ చరిత
కర్మ యోగమే జన్మంతా, ధర్మ క్షెత్రమే బ్రతుకంతా
సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీత
ఈ బోసి నోటి తాతా
మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధి
మహత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్పూర్తి
సత్యాహింసల మార్గ (స్వర్ణ) జ్యోతి, నవ శకానికే నాంది
ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధి
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధి
చ: గుప్పెడు ఉప్పును పోగేసి, నిప్పుల ఉప్పెనగా చేసి
దండి యాత్రనే దండ యాత్రగా ముందుకు నడిపిన అధినేత
సిసలైన జగజ్జేత ...
చరఖా యంత్రం చూపించి, స్వదేశి సూత్రం నేర్పించి
నూలు పోగుతో మదపుటేనుగుల బంధించాడుర జాతిపిత
సంకల్ప బలం చేత..
సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన కాంతి
తూరుపు తెల్లారని నడిరాత్రికి స్వేఛ్చా భానుడి ప్రభాత కాంతి
పదవులు కోరని పావన మూర్తి, హృదయాలేలిన చక్రవర్తి
ఇలాంతి నరుడొకడిలాతలంపై నడయాడిన ఈనాటి సంగతి
నమ్మరానిదని నమ్మకముండే ముందు తరాలకి చెప్పండి
సర్వ జన హితం నా మతం
అంటరాని తనాన్ని అంతః కలహాలన్ని అంతం చేసేందుకే
నా ఆయువంతా అంకితం, హే రామ్
మహాత్మునికి అశ్రు నివాళులతో
జై హింద్!
ఇలాంతి నరుడొకడిలాతలంపై నడయాడిన ఈనాటి సంగతి
రిప్లయితొలగించండినమ్మరానిదని నమ్మకముండే ముందు తరాలకి చెప్పండి
adbhutham, ee madhya kaalamlo naaku baaga nachhina, feel aiyna paata.
గీత యశస్విని గారు, ధన్యవాదాలు. సిరివెన్నెల గారి పాటలు ఎంతో భావోద్వేగంతో చక్కని పద ప్రయోగాలతో ఎలాంటివారికైనా స్పందన కలుగజేస్తాయి. ఆలోచింపజేస్తాయి. అందుకే నాకు చాల ఇష్టం.
రిప్లయితొలగించండి