శ్రీ అక్కినేని నాగేశ్వర రావు |
జన్మదిన శుభాకాంక్షలు
ఎక్కడో వెంకట రాఘవ పురంలో పుట్టి,
అక్కడే ఎన్నో వీధి నాటకాలు వేసి,
ఒక్కడే ఇల్లు వదలి చెన్న పట్నం చేరి,
ఎక్కిన వెండి తెరపై మొదట ఆడవేషం కట్టి,
చక్కని ఎన్నో పాత్రలకు జీవం పోసి,
భక్తుడిగా, బడిపంతులుగా,
బ్రహ్మచారిగా, బుద్ధిమంతుడుగా,
జడ్జిగా, న్యాయవాదిగా,
నాయకుడుగా, నారదుడుగా,
ప్రేమికుడిగా, భగ్న ప్రేమికుడిగా,
రాముడిగా, అభిమన్యుడిగా,
సుపుత్రుడుగా, దత్త పుత్రుడుగా,
పల్లెటూరి బావగా, దసరా బుల్లోడుగా,
బహుదూరపు బాటసారిగా
సీతారామ జననంలో రాముడిగ పుట్టి
మరల సీతారామయ్య గా మధ్యలో వచ్చి
ఇపుడు శ్రీ రామరాజ్యంలో వాల్మీకియై
రాముని వదలని రామదాసుగా, వెరసి
సీతారామ జననంలో రాముడిగ పుట్టి
మరల సీతారామయ్య గా మధ్యలో వచ్చి
ఇపుడు శ్రీ రామరాజ్యంలో వాల్మీకియై
రాముని వదలని రామదాసుగా, వెరసి
జానపద, సాంఘిక, పౌరాణిక చిత్రాల
నాయకునిగా నటించి,
నటనను నిర్వచించి
నటనలో నైపుణ్యం చొప్పించి,
వైవిధ్యమైన పాత్రలలో జీవించి,
క్రమ శిక్షణతో అసాధ్యమైనది
లేదన్న ఆదర్శం నిలబెట్టి,
తన జీవితమొక ఉదాహరణని చూపెట్టి,
పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్,
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వంటి
ఎన్నో పురస్కారాలు పొంది,
మొక్కవోని దీక్షతో ఎదిగి, పేరు తెచ్చుకుని
తెలుగువారిని అలరించిన కలైమామణి
అక్కినేనికి ఎక్కలేని శిఖరాలు లేవు.
శ్రీ అక్కినేని నాగేశ్వర రావు గారికి 88వ జన్మదిన శుభాకాంక్షలు.
wow.....ఏమని వర్ణించనూ...ANR కవితను
రిప్లయితొలగించండిమీరు రాసిన విధమును..ఎనలేని వర్ణాల సంపదలను కూర్చిన
ఏమని వర్ణింపనూ మీ చేతి రాతలనూ
మీ మనసులో భావాలను నాగేశ్వర్‌గారి సినిమాలను..హిరోల పేర్లను..
రాజా రమేష్ కాదు..కృష్ణుడా..వేణునా..ఆనందా
ఇలాంటి పేర్లతో హిరోగా నటియించిన మన ANR గారిని ...
ఏమని వర్ణించనూ.. అందాల రమణులతో..ప్రేమ కురిపించే జవరాళ్ళతో
ఎవ్వరా....సినీమణులు ???
అంజలినా..జానకినా..జయంతినా..వరలక్ష్మినా..
కన్నాంబనా..కాంచననా..కాంచనమాలనా..
సరోజ..రాగిణి..జయంతి..L.విజయలక్ష్మి..KR.విజయ..నా
వాణిశ్రీనా..శ్రీదేవినా..జయసుధనా..జయప్రదనా..రాధనా..
లక్ష్మినా..లతనా..ఒక్కరేమిటీ..పలుమంది నటీమణులతో రాజాధి రాజుగా
నటించిన మన నాగేశ్వరావుగారి విజయ శిఖరాలను ఏమని వర్ణించనూ ....
నమస్తే సూర్యనారాయణ గారు __/\__
రిప్లయితొలగించండివన్స్మోర్..మీ మనసులో ఇలా కవితలధార ఎలా పుడతాయో!!!!
ఆ భగవంతునికే తెలుసు....
ఒక్కొక్క లైన్ చాలా అద్భుతంగా ఉందండీ చాలా బాగా రాసారు
ఇలాంటి కవిత చదువుకొనే అవకాశం
కలిపించినందుకు చాలా కృతజ్ఞ్తలు తెలుపుకొంటున్నాను
ప్రేమతో
శక్తి
శక్తి గారికి, ఇది కాలక్షేపం కవిత్వం. అంత గొప్పగాలేదు. అయితే అక్కినేని గారంటే అభిమానం. ఆయన 1993 లో హ్యూష్టన్, టెక్సాస్ కు వచ్చినపుడు, మా మిత్రులు శ్రీ అహోబిల వజ్ఝల మురళి గారు నాగేశ్వర విజయము" అన్న బుర్రకథను వ్రాయగా దానిలో పాత్రధారిగా వేశాను. ఏమయితేనేం, మీ స్పందనకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమీరనుకున్నది, "అక్కినేనికి ఎక్కని శిఖరాలు లేవు" అనేమో
రిప్లయితొలగించండిసూర్యుడు గారికి, రెండూ సరియైనవే. మీరు భూతకాలాన్ని సూచించారు. నేను భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకుని వ్రాసాను. కానీ మంచి పాయింటు పట్టుకున్నారు. నా బ్లాగు దర్శించినందుకు, మీ అమూల్యమైన సూచనకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి