శ్రీకాకుళం జిల్లా లోని మెళియాపుట్టి మండలం చేపర గ్రామంలో ఉన్న కాలువ బడసాగరం. దీనిని దాటడమంటే భవ సాగరాన్ని దాటడం లాంటిది. దీనిపై పిల్లలు చేసే విన్యాసం వార్తలలో వచ్చింది. ఈ వార్తను చదివాక ఒక చిన్న కవిత వ్రాయాలన్న ఆలోచన వచ్చింది "స్వగతం" లో. నా ఆలోచనలకు అక్షర రూపం ఈ ఫోటో కవిత. అంతే.
వారధి లేని సారధులు
బడసాగరమో భవసాగరమో
ఈదలేని విద్యార్ధుల ఈతిబాధలు
ఇద్దరి నుండి అద్దరికి
నిర్భయం ముందిద్దరికి
కర్రల మీద కాదిది గడ సాము
కుర్రల నడిపించే బడిసాము
వేరేది చేయలేని పరిస్థితి
వారిది ఈదలేని వయోస్థితి
చేరాలి ప్రతిదినము బడికి
చేస్తారు కట్టెలపై గారడి
పట్టుతప్పితే అంతే..అనుకోండి
పట్టువదలని పిల్లలు వాళ్ళండి
భావి విద్యా విశారదులు
వారధి లేని సారధులు
వారధి లేని సారధులు
Chala baavundi Suri garu!
రిప్లయితొలగించండిభలే వారండీ మీరు
రిప్లయితొలగించండివారధే ఉంతే సారధి ఎందుకు ?
సారధే ఉంతే వారధి ఎందుకు ?