14, జనవరి 2012, శనివారం

సంక్రాంతి శుభాకాంక్షలు

పంట చేతికి వచ్చి, 
కోతలు, నూర్పులు పూర్తయి
రైతులకు విత్తము, విశ్రాంతి ఇస్తూ
సంక్రాంతి పండుగ వస్తుంది సందడిగ
ఇదే మనకు ఏటా వచ్చే పెద్ద పండగ
తెల్లవారేసరికి వీధిలో భోగి మంటలు
ముంగిట ముత్యాల ముగ్గులు
నడుమ బంతిపూల గొబ్బెమ్మలు
ఎగరేసే రంగు రంగు పతంగులు
కృష్ణార్పణమంటూ తిరిగే హరిదాసులు
అయ్యగారికీ దండం పెట్టు!
అమ్మగారికీ దండం పెట్టు!
అని ఇంటిముందు ఆడించే డూడూ బసవన్నలు
చెప్పలేని ఆనందం
ప్రతి గడపలో, ప్రతి ఎడదలో

మీకు, మీ కుటుంబ సభ్యులు అందరికీ 
సంక్రాంతి శుభాకాంక్షలు
సూర్యనారాయణ వులిమిరి

5 కామెంట్‌లు:

  1. బాగా వ్రాశారు! మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
  2. రసజ్ఞ గారు, ధన్యవాదాలు. మీకు మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  3. చాలా బాగుంది. హృదయ పూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  4. జయ గారు, ధన్యవాదాలు. మీకు కూడ సంక్రాంతి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  5. మాలా కుమార్ గారు, ధన్యవాదాలు. మీకు కూడ సంక్రాంతి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి

Blog Junctions